సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే, పెరుగుతున్న మార్కెట్ ప్రకారం ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని కొనాలనుకుంటారు. అయితే, వారు వడ్డీ లేకుండా సొంత ఇంటికి కొనుగోలు చేయడం ఎలా అనేది చాలామందికి తెలుసుకోండి. ఈ స్టోరీలో మీరు హోమ్ లోన్ తీసుకున్న వడ్డీని మళ్లీ గెయిన్ చేయడం ఎలా అనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మీరు హైదరాబాద్ లేదా విజయవాడలో ఉన్నారు. సుమారు 20 లక్షలు పెట్టి ఇల్లు కొనాలనుకుంటున్నారు. అందులో మీ దగ్గర రూ.10 లక్షల క్యాపిటల్ ఉంది. మిగిలిన రూ.10 లక్షలను బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. ఆ లోన్ మొత్తం రూ.10 లక్షలు, దానిని తిరిగి చెల్లించడానికి నిర్ణీత కాల పరిమితి 20 సంవత్సరాలు పెట్టుకున్నారనుకోండి. ప్రస్తుతం వివిధ సంస్థలు వడ్డీ రేట్లను 8 శాతం నుంచి 12 శాతం వరకు ఇస్తున్నాయి. వీటిలో సగటు తీసుకుంటే 9.5 శాతం వడ్డీ లెక్కన తీసుకుంటే, మీరు తీసుకున్న వడ్డీకి నెలకు రూ.9321 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే, 20 సంవత్సరాల్లో మీరు మొత్తం రూ.22,37, 114. అంటే, మీరు రూ.10 లక్షలు తీసుకున్న అసలుకు మరో రూ.12.37 లక్షలు వడ్డీ కడుతున్నారన్నమాట.
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఈఎంఐ రూ.9321 అనుకోవద్దు. మీరు రూ.10,321 అనుకోండి. అంటే నెలకు మరో రూ.1000 అదనంగా ఈఎంఐ కడుతున్నాం అనుకుంటూ వాటిని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుబడి పెట్టండి. అలా మీ హోమ్ లోన్ పూర్తయ్యే సమయానికి మీరు నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెడుతూ వెళితే 20 సంవత్సరాల్లో మీరు కట్టే మొత్తం రూ.2.40 లక్షలు అవుతుంది. దానికి మీకు సగటున 15 శాతం వడ్డీ లభించిందనుకుంటే మీకు మొత్తం రూ.14.97 లక్షలు లభిస్తుంది. అందులో మీరు కట్టిన రూ.2.40 లక్షలను తీసేస్తే మీకు రూ.12.57 లక్షలు మిగులుతుంది. అంటే, మీరు హోమ్ లోన్ కోసం కట్టిన వడ్డీ మీకు ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టడం ద్వారా సంపాదించుకోవచ్చు.
ఒకవేళ మీరు రూ.20 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే, మీరు నెలకు రూ.2000 చొప్పున SIP చేయండి. రూ.30 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే రూ.3000 చొప్పున SIP లో పెట్టుబడి పెట్టండి. అంటే మీరు హోమ్ లోన్ తీసుకున్న మొత్తంలో 0.01 శాతం పెట్టుబడి పెట్టాలన్నమాట.
మీరు తీసుకున్న రుణం రూ.10,00,000
మీరు చెల్లించిన వడ్డీ రూ.12,37,144
SIPలో మీరు చెల్లించిన డబ్బు రూ.2,40,000
SIPద్వారా మీకు లభించే ఆదాయం రూ12,57,239
ఈ రకంగా మీరు హోమ్ లోన్ కోసం చెల్లించిన వడ్డీకి, మీకు SIPలో వచ్చిన దానికి లెక్క సరిపోయింది. ఓ రకంగా వడ్డీ లేకుండా మీరు సొంతిల్లు సాధించుకున్నట్టే.