హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan తీసుకోవాలని అనుకుంటున్నారా ? గడువును నిర్ణయించడానికి పరిగణించాల్సిన మూడు అంశాలివే..!

Home Loan తీసుకోవాలని అనుకుంటున్నారా ? గడువును నిర్ణయించడానికి పరిగణించాల్సిన మూడు అంశాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home Loan Tenure: సాధారణంగా హోమ్ లోన్ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టిఈ లోన్ కోసం దరఖాస్తు చేసేముందు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. హోమ్ లోన్ గరిష్ట కాలవ్యవధి లేదా లోన్ గడువు అనేది.. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి రకాన్ని బట్టి ఉంటుంది.

ఇంకా చదవండి ...

భారతీయులు సొంతింటి కల కోసం ఎంతగానో పరితపిస్తుంటారు. ఇందుడు డబ్బు పొదుపు చేస్తూ, సొంత డబ్బుతో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే పరిమిత నిధుల కారణంగా చాలామంది లోన్ తీసుకుంటారు. సాధారణంగా హోమ్ లోన్ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టిఈ లోన్ కోసం దరఖాస్తు చేసేముందు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. హోమ్ లోన్ గరిష్ట కాలవ్యవధి లేదా లోన్ గడువు అనేది.. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి రకాన్ని బట్టి ఉంటుంది. హోమ్ లోన్ వ్యవధి సాధారణంగా 5-30 సంవత్సరాల వరకు ఉంటుంది. లోన్ EMIలను తక్కువగా ఉంచుకోవడానికి తక్కువ వ్యవధికి బదులుగా 25 లేదా 30 సంవత్సరాల సుదీర్ఘ గడువును రుణ గ్రహీతలు ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు లోన్ కాలవ్యవధి మొత్తం రుణ చెల్లింపులను ఎలా ప్రభావితం చేస్తుంది? రుణ గ్రహీతలు దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.

* రుణగ్రహీత వయసు

లోన్ కాలవ్యవధిని నిర్ణయించడంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మొదటి అంశం.. రుణ గ్రహీతల వయసు. మీరు 30 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు వారైతే.. 25 నుంచి 30 సంవత్సరాల కాలవ్యవధిని సులభంగా ఎంచుకోవచ్చు. మీరు స్థిరపడి కుటుంబాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసుకునే వయస్సు ఇదే కాబట్టి, నెలవారీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తక్కువ EMIలను ఎంచుకోవడం మంచిది. అయితే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండి, పెద్ద EMIలను హ్యాండిల్ చేయగలిగితే, చెల్లించాల్సిన వడ్డీని ఆదా చేసేందుకు తక్కువ వ్యవధిని ఎంచుకోవడం మంచిది. 50 ఏళ్ల వయసు వారు మాత్రం తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవాలి.

* లోన్ మొత్తం

రుణ మొత్తం కూడా హోమ్ లోన్ కాలపరిమితిని నిర్ణయించడంలో సహాయపడుతుంది. మీ లోన్ మొత్తం నెలవారీ ఆదాయానికి 6-8 రెట్లు ఎక్కువగా ఉంటే, ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీరు రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అయితే లోన్ మొత్తం మీ నెలవారీ ఆదాయానికి కేవలం 2-3 రెట్లు ఉంటే, తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే వడ్డీ భారం పెరుగుతుంది. అందువల్ల మీ ఆర్థిక స్థితిపై అదనపు భారం పడని లోన్ రీపేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* చెల్లించాల్సిన మొత్తం వడ్డీ

క్రెడిట్ స్కోర్‌తో పాటు, మీరు ఎంచుకున్న లోన్ వ్యవధి కూడా హోమ్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. వడ్డీ రేటును వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. అంటే గడువు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువ కాల వ్యవధితో తీసుకునే లోన్ వడ్డీ రేటు, క్రెడిట్ ధరను పెంచుతుంది. అయితే తక్కువ వ్యవధి ఉంటే మాత్రం తక్కువ క్రెడిట్ ధర ఉంటుంది. అందువల్ల వడ్డీ భారాన్ని తక్కువగా ఉంచడానికి తక్కువ లోన్ గడువు ఆప్షన్‌ను ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు, మీరు 8.2 శాతం చొప్పున 15 ఏళ్లకు రూ. 80 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే.. గడువు ముగిసే సమయానికి చెల్లించే మొత్తం వడ్డీ రూ. 60 లక్షలు అవుతుంది. ఒకవేళ లోన్ గడువు 25 ఏళ్లు అయితే, చెల్లించాల్సిన మొత్తం వడ్డీ రూ. 1.8 కోట్లు.. అంటే దాదాపు రెట్టింపు అవుతుంది.

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

* తుది నిర్ణయం ఎలా తీసుకోవాలి?

గృహ రుణం తీసుకునేవారు నెలవారీ భారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హోమ్ లోన్ EMIల కోసం మీ నెలవారీ ఆదాయంలో పెద్ద మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి, ఎలాంటి డిఫాల్ట్‌లు లేకుండా చెల్లించగల సామర్థ్యాన్ని గుర్తించాలి. ఎంత లోన్ మొత్తాన్ని ఎంత వ్యవధిలో తిరిగి చెల్లించగలరో తెలుసుకున్న తరువాతే లోన్ కాలవ్యవధిపై తుది నిర్ణయం తీసుకోవాలి. కొంతమందికి త్వరగా లోన్ భారాన్ని తొలగించుకోవాలనుకుంటారు. అలాంటి వారు తక్కువ లోన్ గడువు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అధిక EMIలతో లోన్ తీసుకోవడం రిస్క్‌గా భావించేవారు మాత్రం ఎక్కువ కాల వ్యవధితో హోమ్ లోన్ తీసుకోవచ్చు.

First published:

Tags: Home loan

ఉత్తమ కథలు