హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: హోమ్‌ లోన్‌ సాయంతో రూ.3.5 లక్షల వరకు పన్ను ఆదా.. ట్యాక్స్ భారాన్ని తగ్గించే మార్గాలివే..

Home Loan: హోమ్‌ లోన్‌ సాయంతో రూ.3.5 లక్షల వరకు పన్ను ఆదా.. ట్యాక్స్ భారాన్ని తగ్గించే మార్గాలివే..

Home Loan

Home Loan

Home Loan: పన్ను ఆదా విషయంలో కూడా హోమ్ లోన్ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. హౌసింగ్ లోన్ తీసుకుంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అది ఎలానో ఇక్కడ తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సొంతింటి కలను సాకారం చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. ఎక్కువ మొత్తంలో నగదు వెచ్చించాలి కాబట్టి హోమ్‌ లోన్‌(Home Loan)లపై ఆధారపడుతుంటారు. హోమ్‌ లోన్‌ సాయంతో ఇంటిని నిర్మించుకుంటే అద్దె (Rent) కు సంబంధించిన ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. పన్ను ఆదా విషయంలో కూడా హోమ్ లోన్ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. హౌసింగ్ లోన్ (Housing Loan) తీసుకుంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.


* రూ.3.5 లక్షల వరకు డిడక్షన్‌
ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం.. సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు హోమ్ లోన్ ప్రిన్సిపల్ చెల్లింపుపై డిడక్షన్‌ పొందవచ్చు. హోమ్‌ లోన్‌పై చెల్లించే వడ్డీపై సెక్షన్ 24బి కింద రూ.2 లక్షల వరకు అదనపు పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈ రెండు పన్ను ప్రయోజనాలు కలిపి వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.3.5 లక్షలు తగ్గిస్తాయి.


పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి రూ.3.5 లక్షల హోమ్ లోన్ పన్ను ప్రయోజనం తీసివేయగా.. ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం చెల్లించాల్సిన పన్ను భారం తగ్గుతుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటి ప్రాపర్టీ కొనుగోలు ఛార్జీలు కూడా సెక్షన్ 80C కింద డిడక్షన్‌ పొందుతాయి.సెక్షన్ 80C కింద, డిడక్షన్‌ పొందే అనేక ఇతర పెట్టుబడులు, చెల్లింపులు ఉన్నాయని గమనించడం ముఖ్యం. ఈ సెక్షన్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు డిడక్షన్‌ పొందే అవకాశం ఉంది. ఇతర పెట్టుబడులు లేకుండా పన్ను ఫైల్ చేసేవారు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ చెల్లింపుపై ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పూర్తి డిడక్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు.


Fi మనీ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ప్రణీత్ బటినా మాట్లాడుతూ..‘ఇల్లు కొనడం వల్ల పన్ను ప్రయోజనాల(Tax Benefits) పరిధి పెరుగుతుంది. హోమ్ లోన్ అసలు మొత్తానికి చెల్లించే దానిపై డిడక్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటి ఛార్జీలపై కూడా ట్యాక్స్‌ డిడక్షన్‌ పొందవచ్చు. ఈ రెండు డిడక్షన్‌లు సెక్షన్ 80C కింద మొత్తం రూ.1.5 లక్షల పరిమితికి లోబడి ఉంటాయి. సెక్షన్ 24B కింద రూ.2 లక్షల వరకు లోన్‌ ఇంట్రెస్ట్ కాంపోనెంట్‌కి తిరిగి చెల్లించిన మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేయవచ్చు’ అని తెలిపారు.


* ఇల్లు కొనాలంటే హోమ్‌ లోన్‌ తీసుకోవాలా?

ప్రజలు ఇల్లు కొనడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వినియోగానికి, రెండు పెట్టుబడి కోసం. ఈ కారణాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడంలో పరిగణించే అంశాలు, వాటి ప్రాముఖ్యత భిన్నంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు పెట్టుబడి ప్రయోజనాల కోసం ఇంటిని కొనుగోలు చేస్తుంటే, రిస్క్ ప్రొఫైల్, రాబడుల అంచనాలకు సరిపోయే అన్ని ఇతర పెట్టుబడి ఆప్షన్‌లను సమీక్షించాలి.


ఇది కూడా చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల నిజంగా పండగే.. అన్నీ ఒకేసారి వచ్చే అవకాశం


ఇతర మార్కెట్ల మాదిరిగా కాకుండా, హౌసింగ్ మార్కెట్ చాలా లోకలైజ్డ్‌ అని, నిర్దిష్ట మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి, ప్రత్యామ్నాయంగా తక్కువ-రిస్క్ ఉన్న ఇన్‌స్ట్రూమెంట్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని ప్రణీత్ చెప్పారు. పెట్టుబడి ప్రయోజనాల కోసం ఇంటిని కొనుగోలు చేయాలనే నిర్ణయం నిర్దిష్ట హౌసింగ్ మార్కెట్ దృక్పథంపై కూడా ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పటిష్టమైన వృద్ధికి సిద్ధంగా ఉందని గట్టిగా విశ్వసిస్తే, ఆ ఇంటిని కొనుగోలు చేయడం మంచి పెట్టుబడి నిర్ణయం.


అయితే, సొంత అవసరాలకు ఇంటిని కొనుగోలు చేస్తుంటే, హోమ్ లోన్‌పై డౌన్ పేమెంట్ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది రుణ భారం, టెన్యూర్‌, వడ్డీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఇల్లు కొనడానికి గల కారణాలతో సంబంధం లేకుండా, ముందుగా ఆర్థిక స్థితిని అంచనా వేయాలని, నిర్దిష్ట బడ్జెట్‌కు కట్టుబడి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిని కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు ఆర్థిక స్థితిని ప్రభావితం చేయకూడదని చెబుతున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Home loan, Income tax, Personal Finance, Tax deduction, TAX SAVING

ఉత్తమ కథలు