Home /News /business /

HOME LOAN INTEREST TO INCREASE HIGHER EMI OR PREPAYMENT HOW TO MINIMISE RISING COST UMG GH

Home Loan: హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.. తగ్గించుకోవడానికి ఇదే బెస్ట్ ఆప్షన్..!

హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.. తగ్గించుకోవడానికి ఇదే బెస్ట్ ఆప్షన్..!

హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.. తగ్గించుకోవడానికి ఇదే బెస్ట్ ఆప్షన్..!

దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో రెపో రేటు మళ్లీ ప్రీ ప్యాండమిక్‌ లెవల్‌ 5.40 శాతానికి చేరుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో రెపో రేటు మళ్లీ ప్రీ ప్యాండమిక్‌ లెవల్‌ 5.40 శాతానికి చేరుకుంది. మే నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడో సారి రెపో రేటును పెంచింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే రుణాలపై వర్తించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. 2019 అక్టోబరు 1 తర్వాత బ్యాంకులు మంజూరు చేసిన ఆల్-ఫ్లోటింగ్ రేట్ రిటైల్ లోన్‌లు ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌తో లింక్‌ అయి ఉన్నాయి. చాలా బ్యాంకులకు, ఈ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌గా రెపో రేటు ఉంటుంది. రెపో రేటు పెరగడం వల్ల రెపో-రేట్ లింక్డ్ హోమ్ లోన్స్, పర్సనల్ లోన్‌ల వడ్డీ రేట్లు పెరుగుతాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), బేస్ రేట్‌తో లింక్‌ అయిన హెమ్‌ లోన్స్‌ కూడా రెపో రేటు పెంపు తర్వాత ఖరీదైనవిగా మారతాయి.

 ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్.. ఆ ఫోన్‌లు ఇండియాలో బ్యాన్..? ఇక బడ్జెట్ మొబైల్స్ కష్టమే.. ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే..!


* లోన్‌ వడ్డీ రేట్ల పెంపుతో వినియోగదారులపై ప్రభావం
పైసాబజార్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నవీన్ కుక్రేజా మాట్లాడుతూ..‘హోమ్‌ లోన్‌లు, రెపో రేట్లతో లింక్‌ అయిన ఇతర రిటైల్ రుణాలు పాలసీ రేట్ పెంపుతో వెంటనే ప్రభావితమవుతాయి. తాజా ఫ్లోటింగ్ రేట్ రిటైల్ లోన్‌లకు ట్రాన్స్‌మిషన్ వేగంగా ఉంటుంది. తాజా హోమ్ లోన్, ఇతర రిటైల్ లోన్ రుణగ్రహీతలపై పెరిగిన పాలసీ రేట్లను అప్లై చేసే కచ్చితమైన తేదీని మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు నిర్ణయిస్తాయి. వడ్డీ రీసెట్ తేదీల నుంచి పెరిగిన వడ్డీరేట్లను వసూలు చేస్తాయి.’ అని చెప్పారు.

ఆగస్టు 5న ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి.

* హోమ్ లోన్ తీసుకున్నవారు ఏం చేయాలి?

* EMI లేదా లోన్ కాలపరిమితిని పెంచాలా?
పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రస్తుతం హోమ్‌ లోన్‌ తీసుకొని ఉన్నవారు ఈఎంఐ పెంపు, లేదా టెన్యూర్‌ పెంపును సెలక్ట్‌ చేసుకోవచ్చు. టెన్యూర్‌ పెంపు ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవడంతో ఈఎంఐ పెంపు ఆప్షన్‌ కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

* హోమ్ లోన్ ప్రీపేమెంట్
పెరుగుతున్న వడ్డీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి, రుణగ్రహీతలు ముందస్తు చెల్లింపు ఎంపికను పరిగణించవచ్చు. వీలైతే తమ హోమ్‌లోన్‌లను ముందస్తుగా చెల్లించాలి. వడ్డీ వ్యయం తగ్గించుకునేందుకు టెన్యూర్‌ తగ్గింపు ఆప్షన్‌ ఎంచుకోవాలి. రెగ్యులర్ ప్రీపేమెంట్ వల్ల బకాయి ఉన్న లోన్ మొత్తం గణనీయంగా తగ్గుతుంది.



* హోమ్ సేవర్ ఎంపిక మీ కోసం ఇక్కడ ఉంది
పరిమిత లిక్విడిటీ ఉన్న రుణగ్రహీతలు హోమ్ సేవర్ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఈ సదుపాయం కింద, కరెంట్ లేదా సేవింగ్స్ ఖాతా రూపంలో ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో రుణగ్రహీత మిగులు నిధులను డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఆర్థిక అవసరాలకు అనుగుణంగా దాని నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. పొదుపు/కరెంట్ ఖాతాలో ఉంచిన మిగులు మొత్తాన్ని బకాయి ఉన్న హోమ్ లోన్ మొత్తం నుంచి తీసివేసిన తర్వాత హోమ్‌లోన్‌ వడ్డీ లెక్కిస్తారు.

* బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌
తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులకు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయడం మరో ఆప్షన్‌. అర్హత ఉన్న రుణగ్రహీతలు తమ హోమ్ లోన్‌లను ప్రస్తుతం ఉన్న బ్యాంక్‌ కంటే తక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకుకు మార్చుకోవచ్చు. రుణం బ్యాలెన్స్‌ను ఒక బ్యాంక్‌ నుంచి మరో బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి అదనపు ఖర్చులు అవుతాయని గుర్తుంచుకోండి. రుణగ్రహీతలు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకునే ముందే లాభనష్టాలను చూసుకోవాలి.
Published by:Mahesh
First published:

Tags: EMI, Home loans, Interest rates, Rbi

తదుపరి వార్తలు