Bank Loan | సొంతింటి కల సాకారం చేసుకోవాలని చూస్తున్నారా? అయితే చేతిలో డబ్బుల లేవా? చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేయొచ్చు. అన్ని బ్యాంకులు (Banks) కస్టమర్లకు హోమ్ లోన్స్ (Home Loan) అందిస్తున్నాయి. అయితే బ్యాంక్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారతాయి. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంక్‌లో హోమ్ లోన్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వడ్డీ రేటు కాస్త పెరిగినా కూడా హోమ్ లోన్స్‌పై దీర్ఘకాలంలో ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే హోమ్ లోన్ తీసుకునే వారు తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇటీవల కాలంలో చాలా వరకు బ్యాంకులు హోమ లోన్ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంచుకుంటూ వెళ్లడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చ. దీంతో బ్యాంకులు కూడా వరుసపెట్టి రుణ రేట్లు పెంచేశాయి.
SBI బంపరాఫర్.. దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలుపై భారీ తగ్గింపు!
అయితే ఇప్పుడు రెండు బ్యాంకులు మాత్రం హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గించాయి. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే రెండు బ్యాంకులు హోమ్ లోన్స్ రేట్లలో కోత విధించాయి. పండుగ సీజన్‌లో కొత్త ఇల్లు కొనాలని భావించే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ వంటి మార్కెట్ దిగ్గజాల కన్నా తక్కువ వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తున్నాయి.
క్రెడిట్ కార్డు వద్దనుకుంటున్నారా? ఇలా క్లోజ్ చేసుకోండి! ఎంత టైమ్ పడుతుందంటే?
బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే హోమ్ లోన్స్‌పై 8.3 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. రూ.లక్షకు ఈఎంఐ రూ. 755 నుంచి ప్రారంభం అవుతోంది. కస్టమర్లు వారి ప్రస్తుత హోమ్ లోన్స్‌ను ఈ బ్యాంక్‌కు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి, పాత ఇల్లు కొనడానికి, ప్లాట్ కొనుగోలుకు, ఇంటి మరమత్తులు వంటి వాటికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు.
తీసుకున్న రుణాన్ని 30 ఏళ్లలోగా తిరిగి చెల్లించొచ్చు. ప్రిపేమెంట్, పార్ట్‌పేమెంట్ చార్జీలు లేవు. డిసెంబర్ 31 వరకు జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ పొందొచ్చు. ఇక బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కూడా తక్కువ వడ్డీకే హోమ లోన్ అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 8 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన వడ్డీ రేటు మారుతుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Bank of India, Bank of Maharashtra, Banks, Home loans