Home Loan Interest Rate: గృహ రుణాల(Home Loan)పై వడ్డీ రేట్లు ఆల్ టైం కనిష్టానికిదిగొచ్చాయి. లక్షలాది మంది తమ కలల గృహాలను కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో ఎన్నడూ లేని విధంగా గృహ రుణాల (Home Loan)పై వడ్డీ రేట్లు దిగిరావడమే ఇందుకు కారణం. కోవిడ్ 19 తరవాత కుంటుపడిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో వడ్డీ రేట్లు దిగివచ్చాయి. (Home Loan) అయితే బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ఎస్బీఐ, ఐసిఐసిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంకు, కోటక్ బ్యాంకులు గృహ రుణాల (Home Loan) వడ్డీ రేట్లను తగ్గించడంలో పోటీ పడుతున్నాయి. దీపావళి పండగ సందర్భంగా ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటుకు గృహ రుణాలు అందిస్తున్నాయో చూద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
తక్కువ వడ్డీకే గృహ రుణాలు (Home Loan) అందించడంలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ముందు వరుసలో ఉంది. కేవలం 6.7 శాతం వడ్డీకే గృహ రుణాలు అందిస్తోంది. గతంలో రూ.75 లక్షల కన్నా ఎక్కువ గృహ రుణాలు తీసుకున్న వారు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం తీసుకునే రుణ మొత్తంతో సంబంధం లేకుండా గృహ రుణాలను తక్కువ వడ్డీ రేటుకే అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయడం లేదు. బ్యాలెన్స్ బదిలీలకు కూడా ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఈ బ్యాంకు రూ.50 లక్షల వరకు రుణాలకు తాజాగా 0.50 శాతం తగ్గించి 6.6 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు మంజూరు చేస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందిస్తున్న బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు నిలిచింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా 6.75 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు అందిస్తోంది. గృహ రుణాలు, కారు రుణాలపై 0.25 శాతం వడ్డీ మాఫీని ప్రత్యేక ఆఫర్ కింద అమలు చేస్తోంది. ఇక బ్యాంకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు అందిస్తోంది.
యస్ బ్యాంకు
ఈ బ్యాంకు దీపావళి పండగ సీజన్ సందర్భంగా సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలు అందిస్తోంది. 90 రోజుల ప్రత్యేక ఆఫర్ కింద ఉద్యోగం చేసే మహిళలకు అదనంగా 0.05 శాతం వడ్డీ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. అంటే వారికి 6.65 శాతం వడ్డీకే గృహ రుణాలు అందుతాయి.
కోటక్ మహింద్రా బ్యాంకు
కోటక్ బ్యాంకు 6.5 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు అందిస్తోంది దీపావళి పండగ ఆఫర్ లో భాగంగా సెప్టెంబరు 10 నుంచి నవంబర్ 8 వరకు అందుబాటులో తక్కవ ధరకే గృహ రుణాలు అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంకు
ఐసీఐసీఐ బ్యాంకు 6.70 శాతం వడ్డీకే గృహ రుణాలు మంజూరు చేస్తోంది. రుణాల బదిలీ, కొత్త గృహ రుణాలు తీసుకునే వారి నుంచి రూ.1100 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loan