ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ గత వారం కీలకమైన రెపో రేట్లను (RBI Hikes Repo Rate) పెంచింది. దీంతో బ్యాంకులు రుణాలు, డిపాజిట్ల కోసం తమ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో సహా పలు బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్‌లను (Home Loan EMIs Going Up) పెంచాయి.
హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రుణ రేట్‌లు జూన్ 10 నుంచి అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ హౌసింగ్ లోన్‌లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR)ని పెంచుతుంది. అడ్‌జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్(ARHL) 50 బేసిస్ పాయింట్ల మేరకు 2022 జూన్ 10 నుంచి అమల్లోకి వస్తాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ గత వారం కూడా తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 50 బీపీఎస్ మేర పెంచింది. ఈ రేటును 8.60 శాతానికి పెంచినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ జూన్ 8న తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా జూన్ 9 నుంచి అమలులోకి వచ్చే బరోడా రెపో-లింక్డ్ లెండింగ్ రేటు(BRLLR)తో అనుసంధానమైన వివిధ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల మేరకు.. రిటైల్ రుణాలకు వర్తించే BRLLR 7.40 శాతం ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో-లింక్డ్ లెండింగ్ రేటు(RLLR) కూడా పెంచింది. ఇప్పుడు 7.40 శాతంగా ఉంది. జూన్ 9 నుంచి అమలులోకి వస్తుంది. అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రేట్లను సవరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 8వ తేదీ నుంచి సవరించిన RBLR 7.75 శాతం, రెపో రేటు(4.90 శాతం) అమల్లోకి వస్తుంది. దీంతో ప్రధాన బ్యాంకుల హోమ్ లోన్ ఈఎంఐలు ఈ మేరకు పెరగనున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గత వారం ఎంపీసీ కీలకమైన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది. వృద్ధికి సపోర్ట్ ఇస్తూనే.. ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి విత్‌డ్రాయెల్ అకామొడేషన్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
ఆర్‌బీఐ కూడా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 100 బేసిస్ పాయింట్లు పెంచి 6.7 శాతానికి సవరించింది, గతంలో అంచనా వేసిన 5.7 శాతంతో పోలిస్తే.. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. అయితే సెంట్రల్ బ్యాంక్ దానిని 2-6 శాతం లోపల ఉంచడానికి ప్రయత్నించింది. రాబోయే నెలల్లో MPC మరింత పెరగవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెపో రేటు 5.75 శాతానికి చేరే అవకాశం ఉందని నిపుణులు ఇప్పుడు భావిస్తున్నారు.
రష్యా- ఉక్రెయిన్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా పెరిగిన కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, సరఫరా పక్షంలో అంతరాయాలు ముగిసే అవకాశాలు కనిపించడం లేదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ సునీల్ కుమార్ సిన్హా అన్నారు.
2023 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో 7.5 శాతం, రెండో త్రైమాసికంలో 7.4 శాతం, మూడో త్రైమాసికంలో 6.2 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతంగా ఉన్న ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం అంచనాను బట్టి, ఇంకా 25-50 బీపీఎస్ పాయింట్లు అవకాశం ఉందని Ind-Ra విశ్వసించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు 6 శాతానికి పెరగవచ్చని సిన్హా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Banks, EMI, Home loans, Interest rates, Personal Finance