Bank Home Loans | మీరు హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే త్వరపడండి. ఎందుకంటే రానున్న కాలంలో హోమ్ లోన్ (Home Loan) వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు (Banks) హోమ్ లోన్స్‌పై ఆఫర్లు అందుబాటులో ఉంచాయి. ఏ బ్యాంక్‌లో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ ఇండియా పండుగ ఆఫర్లు తీసుకువచ్చింది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును తగ్గించింది. ఇప్పుడు బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.3 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. రూ.లక్ష మొత్తానికి ఈఎంఐ రూ. 799 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు ఉంటుంది. ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకొని ఉంటే ఈ బ్యాంక్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఈ 5 కార్లకు జనాల్లో ఫుల్ క్రేజ్.. తెగ కొనేస్తున్నారు!
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా హోమ్ లోన్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. సిబిల్ స్కోర్ బాగున్న వారికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇక ఈ బ్యాంక్‌లో రూ. లక్ష మొత్తానికి ఈఎంఐ రూ. 862 నుంచి స్టార్ట్ అవుతోంది.
ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి సంవత్సరం చేతికి రూ.2 లక్షలు! ఎలా అంటే?
ఎస్బీఐలో కూడా హోమ్ లోన్ పొందొచ్చు. ఈ బ్యాంక్‌లో కూడా వడ్డీ రేటు 8.4 శాతంగానే ఉంది. ఫెస్టివ్ ఆఫర్లో భాగంగా స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్స్‌పై 0.25 శాతం తగ్గింపు అందిస్తోంది. టాప్ అప్ లోన్స్‌పై అయితే 0.15 శాతం తగ్గింపు ఉంది. ప్రాపర్టీ లోన్స్‌పై అయితే 0.3 శాతం తగ్గింపు పొందొచ్చు. ఎస్బీఐలో రూ.లక్ష మొత్తంపై ఈఎంఐ రూ. 860 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు మాఫీ పొందొచ్చు. 2023 జనవరి 31 వరకు ఆఫర్ ఉంటుంది.
హెచ్డీఎఫ్సీ కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. వడ్డీ రేటు 8.5 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. రూ.లక్షకు ఈఎంఐ రూ. 868 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఇంకో బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో వడ్డీ రేటు 8.3 శాతంగా ఉంది. రూ.లక్ష మొత్తానికి ఈఎంఐ రూ. 855 నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు మారొచ్చు. అందువల్ల మీరు హోమ్ లోన్ తీసుకోవాలనే యోచనలో ఉంటే ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, HDFC bank, Home loans, Icici bank, Personal Finance, Sbi, State bank of india