మీరు హోమ్ లోన్‌కు దరఖాస్తు చేస్తున్నారా? అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి. హోమ్ లోన్ దరఖాస్తులో ఏ చిన్న తప్పు చేసినా అప్లికేషన్ రిజెక్ట్ కావచ్చు. లేదా మీరు కోరుకున్న గడువులో రుణం మంజూరు కాకపోవచ్చు. మీ వయస్సు, వార్షికాదాయం, మీరు రుణం చెల్లించే స్తోమత, మీరు ఇల్లు లేదా ఫ్లాట్ ఎంచుకున్న స్థలం... ఇలా చాలా అంశాలు హోమ్ లోన్‌పై ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు... మీరు గతంలో తీసుకున్న రుణాలు, వాటిని చెల్లించిన తీరు, ఆలస్యంగా చెల్లించిన ఈఎంఐలు లాంటి ఫైనాన్షియల్ రికార్డులను కూడా బ్యాంకులు పరిశీలిస్తాయి. అందుకే హోమ్ లోన్‌కు దరఖాస్తు చేయడానికి ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రుణం మంజూరు విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.
మీరు హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసేముందే మీ పాత లోన్స్ క్లియర్ చేయండి. ఈఎంఐ ఆప్షన్‌తో ఏవైనా వస్తువులు కొన్నా, బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నా వాటిని మొత్తం క్లియర్ చేయండి. ఆ తర్వాత హోమ్ లోన్‌కు దరఖాస్తు చేయండి. మీ ఆదాయంలో 60 శాతం మించి ఈఎంఐ దాటకుండా లెక్కించి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ఒకవేళ పాత ఈఎంఐలు ఏవైనా ఉంటే హోమ్ లోన్ తగ్గుతుంది. అందుకే పాత లోన్స్ క్లియర్ చేసిన తర్వాతే ఇంటి రుణానికి అప్లై చేయాలి. లోన్స్ క్లియర్ చేస్తే సరిపోదు. నో డ్యూస్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం
లోన్ టు వ్యాల్యూ రేషియో ఎక్కువగా ఉన్న బ్యాంకుల నుంచే లోన్లు తీసుకోవాలి. అంటే ప్రాపర్టీ విలువలో ఎక్కువ శాతం రుణం ఇచ్చే బ్యాంకుల్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు ఎంచుకున్న ప్రాపర్టీ విలువ రూ.40 లక్షలు ఉందనుకుందాం. అందులో బ్యాంకులు ఎంత శాతం రుణం ఇస్తాయో కనుక్కోవాలి. 75 శాతం, 80 శాతం, 90 శాతం ఇలా బ్యాంకులు ముందే చెబుతాయి. అందులో ఎక్కువ శాతం రుణం ఇచ్చే బ్యాంకులోనే లోన్‌కు అప్లై చేయాలి. ప్రాపర్టీ వ్యాల్యూ రూ.30 లక్షలలోపు అయితే 90 శాతం, రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు 80 శాతం, రూ.75 లక్షలు మించితే 75% మాత్రమే రుణం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI పరిమితి విధించింది.
మీరు హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసేముందే డౌన్ పేమెంట్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ముందునుంచే పొదుపు చేస్తూ ఉండటం మంచిది. డౌన్ పేమెంట్‌తో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఎన్ని ఆదాయమార్గాలు ఉన్నాయో వాటన్నింటినీ దరఖాస్తులో వివరించాలి. అప్పుడే మీ లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. కో-అప్లికెంట్ని యాడ్ చేస్తే ఎక్కువ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈఎంఐ తగ్గించుకోవాలనుకుంటే లోన్ కాలవ్యవధిని ఎక్కువగా ఎంచుకోవాలి.
ఇవి కూడా చదవండి:
SBI Alert: ఈ తప్పుతో డబ్బులు పోతాయి... హెచ్చరిస్తున్న ఎస్బీఐ
Debit Card: మీ ఫోన్ లాగా ఏటీఎం కార్డును స్విచ్చాఫ్ చేయొచ్చు ఇలా
SBI: ఆన్లైన్లో పేమెంట్స్ చేయాలంటే ఈ ఫీచర్ వాడుకోండిPublished by:Santhosh Kumar S
First published:January 30, 2020, 11:55 IST