Easy Loan: ఏ లోన్ అయినా జస్ట్ 59 నిమిషాల్లోనే... అప్లై చేయండి ఇలా

PSBloansin59minutes.com | మీరు పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే PSBloansin59minutes.com వెబ్‌సైట్‌‌లో రిజిస్టర్ చేసుకొని రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి.

news18-telugu
Updated: September 5, 2019, 4:45 PM IST
Easy Loan: ఏ లోన్ అయినా జస్ట్ 59 నిమిషాల్లోనే... అప్లై చేయండి ఇలా
Loan: ఏ లోన్ అయినా జస్ట్ 59 నిమిషాల్లోనే... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్... ఇలా బ్యాంకు నుంచి ఏదైనా రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇకపై లోన్ మంజూరు కావడానికి రోజుల తరబడి సమయం అవసరమే లేదు. కేవలం 59 నిమిషాల్లో లోన్ సాంక్షన్ అవుతుంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? PSBloansin59minutes.com వెబ్‌సైట్‌తో ఇది సాధ్యమే. గతంలో ఈ వెబ్‌సైట్ ద్వారా కేవలం బిజినెస్ లోన్స్ మాత్రమే లభించేవి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) కేవలం 59 నిమిషాల్లో రుణాలు మంజూరు చేసేవి బ్యాంకులు. ఈ ప్లాట్‌ఫామ్ సక్సెస్ కావడంతో గురువారం హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 59 నిమిషాల్లోనే రుణాలు మంజూరు చేయించుకోవచ్చు. మీరు పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే PSBloansin59minutes.com వెబ్‌సైట్‌‌లో రిజిస్టర్ చేసుకొని రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మీకు కేవలం 59 నిమిషాల్లో లోన్ మంజూరు చేస్తాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్‌ బ్యాంక్ సహా 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు PSBloansin59minutes.com ద్వారా పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. త్వరలో ఆటో లోన్స్ సదుపాయం కూడా రానుంది. మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను చెల్లింపులు లాంటి అంశాలను ఆల్గరిథమ్ ద్వారా విశ్లేషించి రుణాలు మంజూరు చేయడం ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ ప్రత్యేకత. PSBloansin59minutes.com వెబ్‌సైట్‌‌ను 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) ప్రభుత్వ రంగ బ్యాంకులు 59 నిమిషాల్లోనే వ్యాపార రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేసింది. 2019 మార్చి నాటికి 50,706 లోన్ దరఖాస్తులకు ఆమోదముద్ర పడగా, 27,893 దరఖాస్తులకు రుణాలు మంజూరయ్యాయి. వేల కోట్ల రుణాలను కేవలం గంటలోపే మంజూరు చేసిన ఘనత ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ది.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

LIC: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించట్లేదా? పెయిడ్-అప్‌గా మార్చండి ఇలా

PF Balance: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఎంత జమైందో తెలుసా? ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అవండిATM: కార్డు మర్చిపోయారా? అయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఇలా
First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు