Home /News /business /

HOME INSURANCE ALL ABOUT BHARAT GRIHA RAKSHAK POLICY MK GH

Home Insurance: మీ ఇంటికి రక్షణగా నిలిచే ఇన్సూరెన్స్​..భారత్​ గృహ రక్ష పాలసీ గురించి తెలుసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

హోమ్​ ఇన్సూరెన్స్​లకు కూడా డిమాండ్​ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐఆర్​డీఏఐ పరిధిలోని అనేక బీమా సంస్థలు భారత్ గృహ రక్ష పాలసీలను అందిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, ఫైర్​ యాక్సిడెంట్​, సమ్మెలు, అల్లర్ల వల్ల ఆస్తి నష్టం వాటిల్లితే వాటికి కవరేజీ లభిస్తుంది.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇన్సూరెన్స్​ పాలసీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇన్సూరెన్స్ అంటే సాధారణంగా హెల్త్​ ఇన్సూరెన్స్​ అనే భావిస్తారు చాలా మంది. కానీ మనం నివసించే ఇంటికి కూడా ఇన్సూరెన్స్​ తీసుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాల్లో తరచుగా తుఫానులు, వరదలతో భవనాలు దెబ్బతింటున్నాయి. దీంతో ఈ హోమ్​ ఇన్సూరెన్స్​లకు కూడా డిమాండ్​ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐఆర్​డీఏఐ పరిధిలోని అనేక బీమా సంస్థలు భారత్ గృహ రక్ష పాలసీలను అందిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, ఫైర్​ యాక్సిడెంట్​, సమ్మెలు, అల్లర్ల వల్ల ఆస్తి నష్టం వాటిల్లితే వాటికి కవరేజీ లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు, ఫర్నిచర్, ఇతర వస్తువుల నష్టాన్ని ఈ పాలసీతో పూడ్చుకోవచ్చు.

రెసిడెన్షియల్​ హోమ్​ ఉన్న యజమానులు లేదా అద్దెదారులు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీ వ్యవధి ఒకటి నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే 40 ఏళ్లలోపు కట్టిన ఇళ్లకే ఈ పాలసీ వర్తిస్తుంది. పాలసీ కింద చెల్లించాల్సి ప్రీమియం విషయానికి వస్తే.. మీ భవనం నిర్మాణానికి అయిన ఖర్చు, బీమా చేసిన మొత్తాన్ని బట్టి దీన్ని లెక్కిస్తారు.

పాలసీ కవరేజి ఎలా ఉంటుంది?
భారత్ గృహ రక్ష పాలసీలో ఇన్​బిల్ట్​ కవరేజీ లభిస్తుంది. బీమా మొత్తంలో 20% లేదా రూ. 10 లక్షల కవరేజీ అందిస్తుంది. ఈ కవరేజీలో ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చులను పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఫిట్టింగులు, గ్యారేజీలు, అవుట్‌హౌస్‌లు, కాంపౌండ్ గోడలు, కంచెలు, గేట్లు, గోడలు, అంతర్గత రహదారులు, పార్కింగ్ స్పేస్​, రెసిడెన్షియల్​ వాటర్ ట్యాంకులు, పార్కింగ్ స్పేస్​ వంటి అదనపు నిర్మాణాలకు అయిన ఖర్చులకు కవరేజీ అందిస్తారు. ఇక, వరదలు, భూకంపాల కారణంగా ఇంట్లో పొగొట్టుకున్న ఆభరణాలు, వెండి సామాగ్రి, కళాఖండాలు వంటి విలువైన వస్తువులకు షరతులకు లోబడి కవరేజీ లభిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇంట్లోనే మరణిస్తే.. పాలసీదారుడు, జీవిత భాగస్వామికి నష్టపరిహారం కింద ప్రమాద బీమా వర్తిస్తుంది. దీని కింద నామినికి మొత్తం రూ .5 లక్షలు అందజేస్తారు.

ఇన్​బిల్ట్​ కవరేజి
ఏదైనా ప్రకృతి వైపరిత్యం వల్ల మీ ఇళ్లు పూర్తిగా దెబ్బతిని.. దానిలో జీవించడానికి అనువుగా లేకపోతే ప్రత్యామ్నాయ వసతి లేదా అద్దె కోసం ఇన్​బిల్ట్​ కవర్​ను కూడా అందిస్తుంది. శిథిలాల తొలగింపు అయ్యే ఖర్చులో 2%, వాస్తు, సర్వేయర్, కన్సల్టింగ్ ఇంజనీర్ ఫీజుల్లో 5% వరకు క్లెయిమ్​ చేసుకోవచ్చు. అయితే ప్రీమియం ఎంత చెల్లించాలనేది బీమా చేసిన మొత్తం, హోమ్​ రిస్క్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది.

ఎలా క్లెయిమ్​ చేసుకోవాలి?
ఒకవేళ బీమా చేసిన వ్యక్తి క్లెయిమ్​ దాఖలు చేయాల్సి వస్తే, మొదట పాలసీ నంబర్ వివరాలను సదరు బీమా సంస్థకు తెలియజేయాలి. నష్టం జరిగిన తేదీ నుంచి 30 రోజులలోపు క్లెయిమ్ ఫారమ్ సమర్పించాలి. అతని భవనం కూలిపోవడానికి గల కారణాలను క్షుణ్నంగా వివరించాలి. పోలీసులకు లేదా అధికారులు చేసిన సర్టిఫై కాపీలను కూడా సబ్​మిట్​ చేయాలి. ఇళ్లు కూలిపోయిన తర్వాత ఫోటోలను బీమా సంస్థకు సమర్పించాలి.
Published by:Krishna Adithya
First published:

Tags: Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు