HOME BUYERS MAY GET HIGHER TAX DEDUCTIONS ON HOME LOANS IN BUDGET NEXT MONTH REPORT GH VB
Home Loans: హోమ్ లోన్స్‌పై ఎక్కువ ట్యాక్స్ డిడక్షన్స్.. కొత్త బడ్జెట్లో యాన్యువల్ లిమిట్ పెంచే అవకాశం..
ప్రతీకాత్మక చిత్రం
ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న 2022-23 బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా ఇళ్లు కొనుగోలుదారులు (Home Buyers), రియల్టర్లు, పన్ను చెల్లింపుదారులు కేంద్ర బడ్జెట్ (Union Budget)పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
ఫిబ్రవరి(February) ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న 2022-23 బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా ఇళ్లు కొనుగోలుదారులు (Home Buyers), రియల్టర్లు, పన్ను చెల్లింపుదారులు కేంద్ర బడ్జెట్ (Union Budget)పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో హౌసింగ్ డిమాండ్‌ను పెంచడానికి... పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడానికి కేంద్రం సిద్ధమైందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. బడ్జెట్లో హోం లోన్స్‌పై అధిక పన్ను మినహాయింపులను ఆఫర్ చేయొచ్చని నివేదిక అభిప్రాయపడింది. నిర్మలా సీతారామన్ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద హౌసింగ్ లోన్ల ప్రిన్సిపల్ చెల్లింపుపై పన్ను మినహాయింపు వార్షిక పరిమితిని (annual tax deduction) పెంచవచ్చని ఇద్దరు అధికారులు వెల్లడించిన్నట్లు నివేదిక తెలియజేసింది.
ప్రస్తుతం హోమ్ లోన్ ప్రిన్సిపల్ చెల్లింపుల (principal payment)పై పన్ను మినహాయింపు వార్షిక పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంది. దీనిని వచ్చే నెల బడ్జెట్లో రూ. 2 లక్షలకు పెంచవచ్చని తెలుస్తోంది. కరోనా సమయంలో హౌసింగ్ డిమాండ్ తగ్గి భారత రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. మళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో కరోనా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు సరఫరా, డిమాండ్.. ఇలా రెండు వైపులా పన్ను రాయితీలను అందించాల్సిందిగా రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు.
ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం ప్రత్యేకంగా రూ.1.5 లవం హౌసింగ్‌పై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచగలదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఎలాంటి ప్రోత్సాహకాలు అందించకపోతే... గృహ కొనుగోళ్ల పట్ల కొనుగోలుదారులు నిరాసక్తత చూపే అవకాశం లేకపోలేదని ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే, హోంలోన్స్ ప్రిన్సిపాల్ చెల్లింపులపై వార్షిక పన్ను మినహాయింపు పరిమితిని పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వం చివరిసారిగా 2014లో సెక్షన్ 80సీ కింద ఈ మినహాయింపు పరిమితిని రూ. 1.5 లక్షలకు పెంచింది. అయితే ఈ పరిమితి పెరుగుదల అనేది మహమ్మారి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ఖర్చుల పెరుగుదల నుంచి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హోంలోన్స్ పై అధిక పన్ను రాయితీ అందిస్తే.. పన్నులు కట్టే బారినుంచి బయటపడడానికి చాలామంది ఇళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనివల్ల హౌసింగ్ డిమాండ్ పెరిగి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. పన్ను చెల్లింపుదారులు జాతీయ పొదుపు పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్, యులిప్ (ULIP) వంటి ఇతర పథకాలలో కూడా పెట్టుబడి పెట్టి వాటిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందవచ్చు.
బడ్జెట్ అంచనాలపై ఆర్థిక, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సెక్షన్ 24 ప్రకారం గృహ రుణ పన్ను రాయితీని ప్రభుత్వం రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతుందని రియల్టర్లు ఆశిస్తున్నారు. ఇదే జరిగితే హౌసింగ్ డిమాండ్ తక్షణమే పెంచుతుందని... ముఖ్యంగా అఫర్డబుల్, మధ్యతరగతి సెగ్మెంట్ కేటగిరీలలో ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయని రియల్టర్లు భావిస్తున్నారు.
అయితే, 2021 బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినందున ప్రభుత్వం పన్ను మినహాయింపులను అందించకపోవచ్చని మరికొందరు నిపుణులు భావిస్తున్నారు. కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ మినహాయింపులు ఆఫర్ చేయడం లేదు. ఈ కారణంగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే దీనిని ఎంచుకున్నారు. దీంతో కొత్త పన్ను విధానంపై ప్రభుత్వం దృష్టి సారించడానికి పాత పన్ను విధానంలో తగ్గింపులను పెంచకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం 2021లో బలమైన కంబ్యాక్ ఇచ్చింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలు కరోనా ముందు ఉన్న స్థాయిలలో 90 శాతానికి పైగా చేరుకోవడమే దీనికి కారణం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.