కోవిడ్... ఈ పేరు వింటే జనాల్లో వణుకు పుడుతుంది. కానీ అందరూ ఆయన్ని కోవిడ్ అని పిలుస్తుంటారు. ఇందుకు కారణం ఆయన పేరే. అసలు ఆయన పేరేంటో తెలుసా? కోవిడ్ కపూర్ (Kovid Kapoor). అవును... ఇది ఆయన పేరే. ఇటీవలే 30వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం కేక్ ఆర్డర్ చేస్తే... ఆ కేక్‌పైన Covid -30 అని పేరు రాయడం ఆయనకు షాక్ ఇచ్చింది. ఆ ఫోటోను ఆయనే స్వయంగా #KovidnotCovid, #Kovid30 హ్యాష్ ట్యాగ్స్‌తో ట్వీట్ చేశారు. దీంతో అందరూ ఆయన ట్విట్టర్ చెక్ చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్ ప్రొఫైల్‌లో "My name is Kovid and I'm not a virus" అని రాసి ఉండటం విశేషం.
ఇంతకీ ఈ కోవిడ్ కపూర్ ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆయన ఓ స్టార్టప్ కో-ఫౌండర్. 2019 లో హాలిడిఫై పేరుతో ఈ స్టార్టప్ ప్రారంభమైంది. ఎవరైనా భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో టూర్ ప్లాన్ చేసుకుంటే వారికి కావాల్సిన సందేహాలు తీర్చడం, ప్యాకేజీలు సజెస్ట్ చేయడం, హోటళ్లు బుక్ చేసి పెట్టడం ఈ స్టార్టప్ చేసే పని. ఈ స్టార్టప్ ప్రారంభం అయిన టైమ్‌లోనే కరోనా వైరస్ మహమ్మారి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది.
Tim Cook Salary: యాపిల్ సీఈఓ జీతం రూ.734,42,77,875... రోజుకు ఎన్ని కోట్లో తెలుసా?
For my 30th bday, my friends ordered a cake - and Amintiri automatically assumed that it's some kinda joke, and it should be spelled with a C not a K. ? pic.twitter.com/3jrySteSbC
— Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022
కరోనా వైరస్ విజృంభించడం, తన పేరు కోవిడ్ కపూర్ కావడంతో చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని ఆయన వివరించారు. విదేశాలకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. తన పేరు తెలుసుకొని అందరూ నవ్వుకునేవారని తెలిపారు. ఇక భవిష్యత్తులో తాను విదేశాలకు వెళ్తే ఇలాంటి మరిన్ని అనుభవాలు తప్పవని ట్వీట్ చేశారు. జీమెయిల్‌లో తన పేరు సెర్చ్ చేస్తే గూగుల్ కూడా తన పేరును Covid అని ఆటో కరెక్ట్ చేస్తుందని తెలిపారు.
Xiaomi 11 Lite NE 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ 4 రోజులే
When Google though that I misspelled my name, in my own Gmail search ?? pic.twitter.com/sNtZs3GmUb
— Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022
ఇంగ్లీష్‌లో Kovid అని ఉన్నందుకు అందరూ కోవిడ్ అనుకుంటున్నారు కానీ... అసలు పేరు కోవిద్. ఆయన పూర్తి పేరు కోవిద్ కపూర్. కోవిద్ అనే పదం హనుమాన్ ఛాలీసాలో కూడా వస్తుందని, కోవిద్ అంటే పండితుడు అని అర్థం అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో నెటిజర్లను ఫన్నీగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ట్వీట్స్‌తో ఆయన ఇంకా పాపులర్ అయిపోతున్నారు. తనను తానే ట్రోల్ చేసుకుంటూ ఆయన ఫోటోలు పెట్టడం విశేషం. కొందరైతే ఈ పేరుతో ఇక తన స్టార్టప్‌కు మంచి పబ్లిసిటీ వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19, Viral, VIRAL NEWS, Viral tweet