• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • HMSI TO RE OPEN THREE FACTORIES PROVIDE FINANCIAL SUPPORT TO DEALERS MK GH

Honda India: హోండా మోటార్స్ కీలక నిర్ణయం.. మూడు ప్లాంట్లలో వాహనాల ఉత్పత్తి ప్రారంభం

(ప్రతీకాత్మక చిత్రం)

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ (HMSI) కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లో ఉన్న మూడు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని పునఃప్రారంభించినట్టు సంస్థ శనివారం ప్రకటించింది.

  • Share this:
రెండో దశలో విజృంభించిన కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే ప్రస్తుతం కేసులు క్రమంగా తగ్గడంతో లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ (HMSI) కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లో ఉన్న మూడు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని పునఃప్రారంభించినట్టు సంస్థ శనివారం ప్రకటించింది. దీంతో పాటు లాక్‌డౌన్ కారణంగా డీలర్ల వద్ద ఉన్న, అమ్ముడుపోని వేకిల్స్ స్టాక్‌ వడ్డీ ఖర్చును సైతం భరించాలని కంపెనీ నిర్ణయించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్‌ను తిరిగి చెల్లించడానికి డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో డీలర్ పార్న్టర్‌ల క్రెడిట్ స్కోరు, ఫైనాన్షియల్ హెల్త్‌ను కాపాడుకోవడానికి వాహన తయారీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీంతోపాటు కొన్ని సంస్థలు డీలర్‌షిప్‌లలోని ఉద్యోగులకు బీమా ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్లను తొలగించిన తర్వాత, షోరూమ్‌లలో ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి.

* ప్రారంభమవుతున్న ఉత్పత్తి
లాక్‌డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో క్రమంగా ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు హోండా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయని ఒగాటా చెప్పారు. పరిస్థితులను పర్యవేక్షిస్తూ, వాటాదారుల భద్రత, శ్రేయస్సుకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. గత రెండు వారాలుగా కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, మరి కొన్ని వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాయి. అయితే ప్రస్తుతానికి ఒకే షిప్టులో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

* ఆటోమొబైల్ ఇండస్ట్రీపై ప్రభావం
కరోనా కట్టడికి ఏప్రిల్ మొదటి వారంలో మహారాష్ట్రలో కఠినమైన లాక్‌డౌన్ విధించారు. ఈ ప్రభావం ఆటోమొబైల్స్ తయారీ, అమ్మకాలపై పడింది. ఆ తరువాత ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా వాహనాల ఉత్పత్తి నిలిచిపోయింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఇతర ప్రధాన సంస్థలు ఉత్పత్తిని ఆపేశాయి. మరికొన్ని కంపెనీలు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో లిమిటెడ్ వంటి కొన్ని సంస్థలు పరిమిత సామర్థ్యంతో ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. అయితే డెలివరీలు ఆగిపోయినందున కొన్ని సంస్థలు ప్లాంట్లను మూసివేశాయి. దీంతో రానున్న రెండు నెలల్లో వాహనాల అమ్మకాలు తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published: