హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda Activa: కొత్త హోండా యాక్టీవా వచ్చేసింది... ధర రూ.80,000 లోపే

Honda Activa: కొత్త హోండా యాక్టీవా వచ్చేసింది... ధర రూ.80,000 లోపే

Honda Activa: కొత్త హోండా యాక్టీవా వచ్చేసింది... ధర రూ.80,000 లోపే
(image: HMSI)

Honda Activa: కొత్త హోండా యాక్టీవా వచ్చేసింది... ధర రూ.80,000 లోపే (image: HMSI)

Honda Activa | కొత్త హోండా యాక్టీవా వచ్చేసింది. ధర రూ.80,000 లోపే హోండా యాక్టీవా 125 (Honda Activa 125) మోడల్‌ను లాంఛ్ చేసింది హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సరికొత్త యాక్టీవా స్కూటర్‌ను లాంఛ్ చేసింది. ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్స్ 2 (OBD2) ప్రమాణాలకు అనుగుణంగా 2023 యాక్టీవా 125 (2023 Activa 125) మోడల్‌ను లాంఛ్ చేసింది. హెచ్‌స్మార్ట్ వేరియంట్‌తో కొత్త హోండా యాక్టీవా లాంఛ్ కావడం విశేషం. తమ కస్టమర్‌లు తాజా నిబంధనలకు అనుగుణంగా సాఫీగా, అవాంతరాలు లేని ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం తాజా సాంకేతికతను ఉపయోగించామని, తమ కస్టమర్ల జీవితాలను మెరుగుపరిచే వినూత్న, స్థిరమైన పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని HMSI సీఈఓ, ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అత్సుషి ఒగాటా తెలిపారు.

సరికొత్త హోండా యాక్టీవా 125 నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్ వేరియంట్లలో కొనొచ్చు. డ్రమ్ మోడల్ ధర రూ.78,920, డ్రమ్ అలాయ్ మోడల్ ధర రూ.82,588, డిస్క్ మోడల్ ధర రూ.86,093, హెచ్-స్మార్ట్ మోడల్ ధర రూ.88,093. ఇవి ఢిల్లీలో ఎక్స్‌షోరూమ్ ధరలు. పెరల్ నైట్ స్టార్ట్ లాక్, హెవీ గ్రే మెటాల్లిక్, రెబెల్ రెడ్ మెటాల్లిక్, పెరల్ ప్రీషియస్ వైట్, మిడ్‌నైట్ బ్లూ మెటాల్లిక్ కలర్స్‌లో కొనొచ్చు.

Price Hike: బంగారం నుంచి సిగరెట్ల వరకు... ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పెరగనున్నాయి

2023 యాక్టీవా 125 ఫీచర్స్

2023 యాక్టీవా 125 ఫీచర్స్ చూస్తే ఇందులో స్మార్ట్ స్టార్ట్ ఫీచర్ ఉంది. స్మార్ట్ కీ వాహనం నుంచి 2 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే, రైడర్ లాక్ మోడ్‌లోని నాబ్‌ను ఇగ్నిషన్ స్థానానికి తిప్పడం ద్వారా, కీని తీయకుండా స్టార్ట్ బటన్‌ను నొక్కడం ద్వారా వాహనాన్ని సాఫీగా స్టార్ట్ చేయవచ్చు. స్మార్ట్ కీతో రైడర్లు పార్కింగ్ ఏరియాలో ఉన్న తమ స్కూటర్‌ను సులువుగా కనిపెట్టవచ్చు. కీపై ఆన్సర్ బ్యాక్ బటన్ నొక్కితే స్కూటర్ 10 మీటర్ల పరిధిలో ఉంటే, టర్న్ ఇండికేటర్స్ రెండుసార్లు బ్లింక్ అవుతాయి. ఇలా తమ స్కూటర్ ఎక్కడ ఉందో సులువుగా గుర్తించవచ్చు.

Medicine Prices: అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి 384 మందుల ధరలు పెరగనున్నాయి

యాక్టీవా 125 స్మార్ట్ ECU ఉంటుంది. ECU, స్మార్ట్ కీ మధ్య ఎలక్ట్రానిక్‌గా మ్యాచింగ్ ఐడీతో భద్రతా పరికరంలాగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ దొంగతనాన్ని నివారిస్తుంది. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్‌తో పాటు సంప్రదాయ కీహోల్‌కు బదులుగా, ఇగ్నిషన్‌ను ఆన్ చేసి ఇంజిన్‌ను స్టార్ట్, స్టాప్ చేసే నాబ్ ఉంటుంది. సైడ్-స్టాండ్-కట్-ఆఫ్-స్విచ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఓపెన్ గ్లోవ్‌బాక్స్, LED హెడ్‌ల్యాంప్, లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. డిజిటల్ స్క్రీన్‌పై రియల్‌టైమ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంప్టీ, ఫ్యూయెల్ గేజ్, యావరేజ్ మైలేజ్, టైమ్ లాంటి వివరాలు కనిపిస్తాయి. ఇందులో 125సీసీ ఇంజిన్ ఉంటుంది.

First published:

Tags: Honda, Honda Activa, SCOOTER, Two wheeler

ఉత్తమ కథలు