HINDUSTAN MOTORS AND PEUGEOT TO LAUNCH FIRST ELECTRIC AMBASSADOR CAR SOON SS
Ambassador Electric Car: అంబాసిడర్ కార్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే వార్త... ఎలక్ట్రిక్ వర్షన్‌తో రాబోతోంది
Ambassador Electric Car: అంబాసిడర్ కార్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే వార్త... ఎలక్ట్రిక్ వర్షన్‌తో రాబోతోంది
(ప్రతీకాత్మక చిత్రం)
Ambassador Electric Car | అంబాసిడర్ కార్ మరోసారి భారతీయ రోడ్లపై హవా చాటేందుకు వస్తోంది. అంబాసిడర్ ఎలక్ట్రిక్ వర్షన్‌తో రాబోతోందన్న వార్తలు వస్తున్నాయి. హిందుస్తాన్ మోటార్స్ (Hindustan Motors) , పుజో కంపెనీలు అంబాసిడర్ 2.0 రూపొందించనున్నాయి.
భారతీయ రోడ్లను దశాబ్దాల పాటు ఏలిన అంబాసిడర్ కార్ (Ambassador Car) మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలో మళ్లీ ఇండియన్ రోడ్లపై అంబాసిడర్ కార్ చక్కర్లు కొట్టబోతోంది. అంబాసిడర్ కార్ పునరాగమనానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. హిందుస్తాన్ మోటార్స్ (Hindustan Motors) మళ్లీ అంబాసిడర్ కారును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంబాసిడర్ కార్ ఎలక్ట్రిక్ వర్షన్‌తో రాబోతోందని లేటెస్ట్గా వార్తలొస్తున్నాయి. అంబాసిడర్ 2.0 మోడల్‌ను తీసుకొచ్చేందుకు హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (HMFCI) ఫ్రెంచ్ కార్ మేకర్ అయినా పుజో (Peugeot) కంపెనీతో చేతులు కలిపింది. మొదట ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చేందుకు ఈ రెండు కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఈ రెండు సంస్థలు కలిసి అంబాసిడర్ 2.0 డిజైన్, ఇంజిన్‌పై పనిచేస్తున్నాయి. ఇప్పటికే అంబాసిడర్ 2.0 డిజైన్ ఓ దశకు వచ్చేసింది. రెండేళ్లలో అంబాసిడర్ 2.0 మోడల్ ఇండియాలో లాంఛ్ కానుంది. నెక్స్ట్ జనరేషన్ అంబాసిడర్ కారును చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్లాంట్‌లో తయారు చేస్తారు. సీకీ బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన HMFCI ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్లాంట్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో మిత్సుబిషి కార్లు తయారవుతున్నాయి.
ఐకానిక్ కార్ అయిన అంబాసిడర్ గురించి పరిచయం అక్కర్లేదు. బ్రిటీష్ కార్ అయిన మోరీస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ III ఆధారంగా హిందుస్తాన్ మోటార్స్ 1957లో అంబాసిడర్ కారును లాంఛ్ చేసింది. ఈ ఐకానిక్ కారు స్టేటస్ సింబల్‌గా మారింది. దశాబ్దాలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 1970వ దశకంలో 75 శాతం మార్కెట్ షేర్ హిందుస్తాన్ మోటార్స్‌దే. అంటే అప్పట్లో అంబాసిడర్ కార్ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత దశల వారీగా అంబాసిడర్ కార్ డిమాండ్ తగ్గుతూ వచ్చింది.
మారుతీ 800 లాంటి మోడల్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ కావడంతో ప్రజలు తక్కువ ధరకు లభించే ఇలాంటి కార్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో అంబాసిడర్ కార్కు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. అయితే 57 ఏళ్ల పాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు తయారీని 2014లో నిలిపివేసింది హిందుస్థాన్ మోటార్స్.
ప్లాంట్ మూసివేయడానికి ముందు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పరాలోని HM ఫ్యాక్టరీ నుంచి చివరి కారు మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం కొత్త అంబాసిడర్ కార్లు మార్కెట్లో లేవు. డిమాండ్ లేకపోవడం, అప్పుల కారణంగా అంబాసిడర్ కారును నిలిపివేసింది హిందుస్తాన్ మోటార్స్. 2017లో హిందుస్థాన్ మోటార్స్ పుజోతో ఒప్పందం కుదుర్చుకుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.