HINDUSTAN FOODS DFM FOODS HIT 52 WK HIGHS RALLY OVER 100 PC FROM MARCH LOWS MK
ఆలూ చిప్స్ అని తీసి పారేయొద్దు...ఈ కంపెనీల స్టాక్స్ బంగారు గడ్లు పెట్టే బాతులు...
ప్రతీకాత్మకచిత్రం
తాజాగా ఫుడ్ కంపెనీలు హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్, డీఎఫ్ఎం ఫుడ్స్ లిమిటెడ్ మదుపరులకు మంచి లాభాలను పంచిపెడుతున్నాయి. ఈ వారంతంలో ఈ రెండు కంపెనీలు కూడా మంచి లాభాలను నమోదు చేసుకున్నాయి.
స్టాక్ మార్కెట్లలో ప్యాకేజ్ ఫుడ్ కంపెనీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా ప్యాకేజ్ ఫుడ్‌కు ఆదరణ పెరుగుతోంది. జనం ఇళ్లకే పరిమితం అవ్వడంతో, ఎక్కువగా ప్యాకేజీ ఫుడ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రంగంలోని పలు కంపెనీలకు లాభాలు వస్తున్నాయి. తాజాగా ఫుడ్ కంపెనీలు హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్, డీఎఫ్ఎం ఫుడ్స్ లిమిటెడ్ మదుపరులకు మంచి లాభాలను పంచిపెడుతున్నాయి. ఈ వారంతంలో ఈ రెండు కంపెనీలు కూడా మంచి లాభాలను నమోదు చేసుకున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో హిందుస్తాన్ ఫుడ్స్ చక్కటి ఫలితాలు సాధించింది. ఎఫ్ఎంసీజీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించిన ఈ కంపెనీల వివరాలు చూద్దాం..
హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్
శుక్రవారం వరుసగా మూడో రోజు హిందుస్తాన్ ఫుడ్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 858 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 2 రోజుల్లోనూ అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో నమోదైన కనిష్టం రూ. 380 నుంచి చూస్తే 126 శాతం దూసుకెళ్లింది. కంపెనీ ప్రధానంగా హిందుస్తాన్ యూనిలీవవర్, పెప్సీ కో తదితర ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తుంటుంది.
డీఎఫ్ఎం ఫుడ్స్ లిమిటెడ్
ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో క్రాక్స్, కర్ల్స్, నట్‌ఖట్ తదితర బ్రాండ్లు కలిగిన డీఎఫ్ఎం ఫుడ్స్ కౌంటర్ శుక్రవారం వరుసగా నాలుగో రోజూ వెలుగులో నిలిచింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. రూ. 360ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివరికి 2.6 శాతం లాభంతో రూ. 342 వద్ద స్థిరపడింది. గత 4 సెషన్లలోనే డీఎఫ్ఎం ఫుడ్స్ షేరు 24 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో 2020 మార్చిలో నమోదైన కనిష్టం రూ. 154 నుంచి షేరు 133 శాతం జంప్ చేయడం గమనార్హం.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.