డీజిల్ ధరల ఎఫెక్ట్... తగ్గిన కాస్ట్‌లీ కార్ల అమ్మకాలు!

యూవీ వేరియంట్లలో 84 శాతం డీజిల్‌తో నడిచేవే. ఇప్పుడు డీజిల్ ధరలు పెట్రోల్ కన్నా వేగంగా పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధర 26 శాతం పెరిగింది. యూవీ సేల్స్ పడిపోవడానికి పెరుగుతున్న డీజిల్ ధరలే కారణమని అంచనా వేస్తున్నారు నిపుణులు.

news18-telugu
Updated: October 16, 2018, 3:38 PM IST
డీజిల్ ధరల ఎఫెక్ట్... తగ్గిన కాస్ట్‌లీ కార్ల అమ్మకాలు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెరుగుతున్న డీజిల్ ధరలు కార్ల డిమాండ్‌ని తగ్గిస్తున్నాయి. డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతుంటే... కొత్త కార్లకు డిమాండ్ తగ్గిపోతోంది. గతేడాదితో పోలిస్తే యుటిలిటీ వెహికిల్స్, డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్స్‌ అమ్మకాలు తగ్గాయి.

ప్యాసింజర్ వెహికిల్స్ సెగ్మెంట్‌‌లో యూవీ, కార్, వ్యాన్స్ ఉంటాయి. యూవీలో స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్(ఎస్‌యూవీ), మల్టీ-పర్పస్ వెహికిల్(ఎంపీవీ) ఉంటాయి. ఎస్‌‌యూవీలతోనే యూవీ మార్కెట్ విస్తరిస్తుంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్థభాగంలో యూవీ కార్లు 5.4 శాతం, కార్లు 6.8 శాతం, వ్యాన్స్ 14.5 శాతం అమ్మకాలు పెరిగాయి. అయితే గతేడాది ఇదే సమయంలో యూవీ సేల్స్ 18 శాతం, కార్ల సేల్స్ 6.6 శాతం, వ్యాన్ల అమ్మకాలు 2.5 శాతం పెరిగాయి. యూవీ సేల్స్ దారుణంగా పడిపోయాయని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది.

ప్రస్తుతం యూవీ వేరియంట్లలో 84 శాతం డీజిల్‌తో నడిచేవే. ఇప్పుడు డీజిల్ ధరలు పెట్రోల్ కన్నా వేగంగా పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధర 26 శాతం పెరిగింది. యూవీ సేల్స్ పడిపోవడానికి పెరుగుతున్న డీజిల్ ధరలే కారణమని అంచనా వేస్తున్నారు నిపుణులు. గతంలో అమ్మకాల వృద్ధి డబుల్ డిజిట్ ఉంటే... ఇప్పుడు సింగిల్ డిజిట్‌కే పడిపోయింది.

ఇవి కూడా చదవండి:హానర్ 8ఎక్స్ రిలీజ్ చేసిన హువావే!

ఏసుస్ నుంచి మరో రెండు ఫోన్లు!

ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!
Loading...
త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్!
First published: October 16, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...