news18-telugu
Updated: December 10, 2019, 10:49 PM IST
చందా కొచ్చర్ కేసులో ఆర్బీఐకి హైకోర్టు నోటీసులు...
చందా కొచ్చర్ కేసులో ఆర్బీఐకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు విధుల నుంచి తప్పించే నిర్ణయాన్ని ఆర్బీఐ ఆమోదించడాన్ని ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచ్చర్ ముంబై హైకోర్టులో సవాలు చేశారు. ఆర్బీఐ నిర్ణయంపై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను గత మార్చి 13న కొచ్చర్ తొలగింపు నిర్ణయానికి ఆర్బీఐ ఆమోద ముద్ర వేసింది. ఆమెను జనవరి 31న బ్యాంకు యాజమాన్యం విధుల నుంచి తప్పించింది. ఆర్బీఐ నుంచి అనుమతి రాకుండానే తనను విధుల నుంచి ఎలా తొలగిస్తారని కొచ్చర్ ప్రశ్నించారు. ఇప్పటికే ఆమె ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ఆర్బీఐను కూడా ప్రతివాదిగా చేర్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆర్బీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తుదుపరి విచారణ డిసెంబర్ 18న జరగనుంది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై గతేడాది దుమారం చెలరేగింది. దీంతో బ్యాంక్ బోర్డు తాత్కాలికంగా కొచ్చర్‌ను బాధ్యతల నుంచి తప్పించింది.
Published by:
Krishna Adithya
First published:
December 10, 2019, 10:49 PM IST