హోమ్ /వార్తలు /బిజినెస్ /

Xoom Scooter: అదిరిపోయే లుక్‌తో హీరో కొత్త స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్లు సూపర్!

Xoom Scooter: అదిరిపోయే లుక్‌తో హీరో కొత్త స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్లు సూపర్!

Xoom Scooter: అదిరిపోయే లుక్‌తో హీరో కొత్త స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్లు సూపర్!

Xoom Scooter: అదిరిపోయే లుక్‌తో హీరో కొత్త స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్లు సూపర్!

Hero Scooter | హీరో కొత్త స్కూటర్ తెచ్చింది. అదిరిపోయే డిజైన్‌తో సూపర్ ఫీచర్లతో ఈ స్కూటర్ మార్కెట్‌లోిక ఎంట్రీ ఇచ్చింది. దీని రేటు బడ్జెట్ రేంజ్‌లోనే ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Hero Xoom Scooter | దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా అదిరిపోయే స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు Xoom. కంపెనీ హోండా (Honda) యాక్టివా స్కూటర్‌కు (Scooter) పోటీగా ఈ మోడల్‌ను లాంచ్ చేసింది. అందుబాటు ధరలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్కూటర్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఇది 110 సీసీ స్కూటర్. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 68,599 నుంచి ఉంది. హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వొచ్చని మార్కెట నిపుణులు పేర్కొంటున్నారు.

హీరో ఈ కొత్త స్కూటర్ బుకింగ్స్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం అవుతాయి. మూడు వేరియంట్ల రూపంలో ఈ కొత్త స్కూటర్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఎల్ఎక్స్ షీట్ డ్రమ్ ఒక వేరియంట్. దీని రేటు రూ. 68,599. అలాగే వీఎక్స్ కాస్ట్ డ్రమ్ రెండో వేరియంట్. దీని రేటు రూ. 71,799. ఇంకా జెడ్ఎక్స్ కాస్ట్ డ్రమ్ మూడో వేరియంట్. దీని ధర రూ. 76,699గా ఉంది. ఇవ్వన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు.

ఈ కారుకు భలే డిమాండ్.. కొనాలంటే సంవత్సరం ఆగాల్సిందే!

’గత కొన్నేళ్లుగా చూస్తూ.. హీరో మోటొకార్ప్ కంపెనీ ఎన్నో ఐకానిక్ బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. అదిరిపోయే లుక్, మంచి పనితీరు ప్రాతిపదికన తాజాగా హీరో Xoom స్కూటర్‌ను తాజాగా మార్కెట్‌లోకి తీసుకువచ్చాం. మా జర్నీలో ఈ మోడల్ మరో మైలురాయిగా నిలుస్తుంది. యువత లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఆధారంగా ఈ స్కూటర్‌ను తీసుకువచ్చాం. దీని ద్వారా కంపెనీ స్కూటర్ పోర్ట్‌ఫోలియో మరింత బలముగా తయారు అవుతుంది’ అని హీరో మోటొకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవిజిత్ సింగ్ తెలిపారు.

ఈ ఎలక్ట్రిక్ కారుతో రూ.14 లక్షలు ఆదా.. ఒక్కసారి చార్జ్ చేస్తే 240 కి.మి వెళ్లొచ్చు!

హీరో కొత్త స్కూటర్‌లో ఎల్ఈడీ లైటింగ్ ప్యాకేజ్ ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, హెచ్ఐసీఎల్ హీరో ఇంటెలిజెంట్ కార్నరింగ్ లైట్ వంటివి ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ స్కూటర్‌లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్, పెద్ద టైర్లు, డిజిటల్ స్పీడో మీటర్, కీ అలర్ట్స్, లో ఫ్యూయెల్ ఇండికేటర్, బూల్ లైట్, లో ఫోన్ బ్యాటరీ, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్, మొబైల్ చార్జర్ వంటి పలు రకాల ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో ఉన్న 110 సీసీ ఇంజిన్ పవర్ 8.05 బీహెచ్‌పీ, టార్క్ 8.7 ఎన్ఎం. ఐ3ఎస్ టెక్నాలజీ ఉంటుంది. ఈ స్కూటర్ ఐదు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. బ్లూ, బ్లాక్, సిల్వర్, వైట్, రెడ్ అనే రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ కొత్త స్కూటర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

First published:

Tags: Hero moto corp, Honda, Honda Activa, SCOOTER

ఉత్తమ కథలు