HERO VENKATESH TRAVELLED IN RTC BUS WITH HIS FAMILY TSRTC MD SAJJANAR SHARED VIDEO NS
Hero Venkatesh-TSRTC: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన హీరో వెంకటేష్ కుటుంబం.. వీడియో షేర్ చేసిన సజ్జనార్.. ఇదిగో వీడియో
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన హీరో వెంకటేష్ కుటుంబం.. వీడియో షేర్ చేసిన సజ్జనార్..వీడియో ఇదే
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ (Hero Venkatesh) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) షేర్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ వీడియో చూడండి..
తెలంగాణ ఆర్టీసీ (TSRTC) చైర్మన్ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్ (Sajjanar) బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంస్థ రూపు రేఖలు మారుతున్నాయి. సరికొత్త నిర్ణయాలతో ఆయన సంచలనాలు సృష్టిస్తున్నారు. మూస పద్ధతిని వీడి సంస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ (Digital Payments), ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందడం, కార్కో సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, వివాహ శుభకార్యాలకు ఎలాంటి అడ్వాన్స్ లు లేకుండానే బస్సులను అద్దెకు ఇవ్వడం లాంటి అనేక నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే భారీగా లాభాలు వచ్చేలా ఆయన తీసుకున్న నిర్ణయానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సజ్జనార్ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ ప్రయాణికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఇటీవల ఓ యువతి అర్థరాత్రి సమయంలో చేసిన ట్వీట్ కు ఆయన స్పందించి సమస్య పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చిన తీరు అభినందలు అందుకుంది.
దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్. ఈ నేపథ్యంలో అనేక సినిమా క్లిప్పింగ్ లను ఆయన షేర్ చేశారు. ఇంకా సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించే వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. సదూర ప్రయాణాలకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి తన ప్రత్యేకతను చాటారు సజ్జనారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్ (Hero Venkatesh) ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీన్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను సజ్జనార్ షేర్ చేశారు. ‘‘కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం ఇలా ఆనందంగా ఉంటుంది.’’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు సజ్జనార్. Telangana RTC: చేతిలో డబ్బులు లేకున్నా ఆర్టీసీ బస్సులో ప్రయాణించొచ్చు.. తెలంగాణ ఆర్టీసీలో మరో వెసులుబాటు
ఈ వీడియోకు అనేక మంది ప్రయాణికులు స్పందిస్తున్నారు. ఆర్టీసీ బస్సుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘సర్ మీ ఆలోచనలే అద్భుతం... వాడటం మొదలు పెడితే మీరు వాడినట్టు సోషల్ మీడియాను ఎవరు వాడరేమో లవ్ యూ సర్’’ అంటూ ఓ ప్రయాణికుడు కామెంట్ పెట్టారు. ‘‘తెలంగాణ రాష్ట్ర రోడ్ సర్వీస్ ఉండగా మాకు ప్రయాణానికి లేదిక ఎలాంటి చింతన థాంక్యూ సజ్జనార్ సర్.’’ అంటూ మరో ప్రయాణికుడు కామెంట్ పెట్టారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.