Hero Splendor: దీపావళి సీజన్లో దుమ్ములేపిన స్ప్లెండర్ అమ్మకాలు.. ఆల్ టైం రికార్డ్.. మొత్తం ఎన్నంటే..

కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఏడాది దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. భారతీయ ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ఫ్ ఉత్పత్తి అయిన హీరో స్ప్లెండర్ వేరియంట్ అక్టోబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా నిలిచింది.

news18-telugu
Updated: November 20, 2020, 5:15 PM IST
Hero Splendor: దీపావళి సీజన్లో దుమ్ములేపిన స్ప్లెండర్ అమ్మకాలు.. ఆల్ టైం రికార్డ్.. మొత్తం ఎన్నంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఏడాది దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. భారతీయ ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ఫ్ ఉత్పత్తి అయిన హీరో స్ప్లెండర్ వేరియంట్ అక్టోబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా నిలిచింది. కాగా, 3.15 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకంతో హీరో మోటోకార్ఫ్ కొంతకాలంగా భారత మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉంది. కాగా, హీరో మోటోకార్ప్ సంస్థ కేవలం ఒక్క అక్టోబర్ నెలలోలోనే 3.15 లక్షలకు పైగా స్ప్లెండర్ బైక్ లను విక్రయించగలిగింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ బైక్ అమ్మకాల్లో 19 శాతం మేర వృద్ధి నమోదైంది.  అయితే, ఈ పండుగ సీజన్లో హీరో మోటోకార్ప్ మొత్తం 7,91,137 ద్విచక్ర వాహనాలను అమ్మితే, అందులో కేవలం స్ప్లెండర్ శ్రేణి బైకులే 3.15 లక్షల అమ్మాకాలు నమోదు చేశాయి.

ఈ సంఖ్యను బట్టి స్ప్లెండర్ వేరియంట్ హీరోకు గణనీయమైన అమ్మాకాలను అందించిందని చెప్పవచ్చు. ఇది అమ్మకాల పరంగా హీరో సంస్థను మార్కెట్ లీడర్‌గా నిలబెట్టడానికి సహాయపడింది. కాగా, ద్విచక్ర వాహనాల విభాగంలో 2019 అక్టోబర్‌ నెలలో నమోదైన 33.40 శాతం అమ్మకాల నుంచి గత నెలలో నమోదైన 38.52 శాతానికి పెరిగాయి. ప్రస్తుతానికి, స్ప్లెండర్ శ్రేణిలో స్ప్లెండర్ ఐస్మార్ట్, స్ప్లెండర్ ప్లస్, సూపర్ స్ప్లెండర్ అనే మూడు వేర్వేరు బైక్ వేరియంట్లు ఉన్నాయి.

మూడు వేరియంట్లలో హీరో స్ప్లెండర్ లభ్యం..
హీరో స్పెండర్ మూడు వేరియంట్ల ఫీచర్స్ విషయానికి వస్తే స్ప్లెండర్ ప్లస్ వేరియంట్ 97.2 సీసీ ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సి ఇంజిన్ తో వస్తుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 8 పిఎస్ మ్యాగ్జిమం పవర్ ను, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, స్ప్లెండర్ ఐస్‌మార్ట్ 113.2 సిసి ఎయిర్-కూల్డ్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.15 పిఎస్‌ మాగ్జిమం పవర్ ను, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.89 ఎన్‌ఎమ్‌ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

సూపర్ స్ప్లెండర్ విషయానికి వస్తే దీనిలో124.7 సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఓహెచ్‌సి, సింగిల్ సిలిండర్ యూనిట్ ఉంటుంది. ఇది 10.87 పిఎస్/10.6 ఎన్ఎమ్ రేటింగ్ తో వస్తుంది. స్పెండర్ ప్లస్, ఐస్మార్ట్ రెండు వేరియంట్లు 4- స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తాయి. కాగా సూపర్ స్ప్లెండర్ 5- స్పీడ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. భారత మార్కెట్(న్యూఢిల్లీ, ఎక్స్షోరూం)లో స్ప్లెండర్ ప్లస్ ధర రూ .60,960 నుంచి రూ .64,470 వరకు ఉంది. స్ప్లెండర్ ఐస్‌మార్ట్ ధర రూ .65,950 నుంచి రూ .68,150 మధ్య ఉంది. మరోవైపు, సూపర్ స్ప్లెండర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ .69,450, డిస్క్ బ్రేక్ ట్రిమ్ వేరియంట్ రూ .72,950కు లభిస్తుంది.
Published by: Nikhil Kumar S
First published: November 20, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading