హీరో మోటార్ (Hero Motor) కంపెనీ ఇండియన్ మార్కెట్ షేర్ పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. యూత్ టార్గెట్‌గా కంపెనీ అనేక వెహికల్స్ రిలీజ్ చేస్తోంది. ముఖ్యంగా స్కూటర్ సెగ్మెంట్‌లో ఇతర కంపెనీల కంటే మెరుగైన మోడళ్లను పరిచయం చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ ఇండియాలో సరికొత్త హీరో మాస్ట్రో జూమ్ (Hero Maestro XOOM) స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ వెహికల్ LX, VX, ZX వంటి మూడు ట్రిమ్స్‌లో లభిస్తుంది.
ఈ సరికొత్త హీరో స్కూటర్ సోమవారం అధికారికంగా లాంచ్ అయింది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్, బ్లాక్, స్పోర్ట్స్ రెడ్, పోలెస్టార్ బ్లూ, పెరల్ సిల్వర్ వైట్ వంటి ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. హీరో మాస్ట్రో XOOM స్కూటర్, కంపెనీ నుంచి వస్తున్న మూడో గేర్‌లెస్ స్కూటర్. ఈ సిరీస్‌లో ఇప్పటికే మాస్ట్రో ఎడ్జ్, ప్లెజర్ ప్లస్ మోడళ్లు లాంచ్ అయ్యాయి.
* ధర ఎంత?
హీరో మాస్ట్రో జూమ్ LX వేరియంట్ ధర రూ.68,599 కాగా, VX, ZX వేరియంట్లు రూ.71,799, రూ.76,699 ఎక్స్-షోరూమ్ ధరలకు అందుబాటులో ఉంటాయి.
* డిజైన్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్
హీరో మాస్ట్రో జూమ్ (2023 Hero Maestro XOOM) స్కూటర్‌కు దాని డిజైన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. దీని LED హెడ్‌ల్యాంప్ సరికొత్తగా కనిపిస్తోంది. LED DRLలు X షేప్‌లో ఉన్నాయి. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. మాస్ట్రో XOOM స్కూటర్ 110.9 cc సింగిల్ సిలిండర్, CVTతో పెయిర్ అయిన ఎయిర్ కూల్డ్ Fi ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 7,250 rpm వద్ద 8.05 bhp అవుట్‌పుట్, 5,750 rpm వద్ద 8.70 Nm టార్క్ అందిస్తుంది. స్కూటర్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లుగా ఉంది.
ఇది కూడా చదవండి : Economic Survey 2023: ఆధార్ కార్డుతో అకౌంట్‌లోకి డబ్బులు.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన, ఆర్థిక సర్వేలో వెల్లడి!
* ఇతర ఫీచర్లు
ఈ స్కూటర్ 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది. టాప్ ఎండ్ ZX మోడల్ కార్నరింగ్ లైట్‌తో వస్తుంది. రైడర్ పక్కకు తిరగడానికి మొగ్గు చూపినప్పుడు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఇదే వేరియంట్‌లో యాంగ్యులర్ ఫ్రంట్ ఆప్రాన్‌పై ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్ కూడా ఉంది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS), ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ XTEC టెక్నాలజీ, పిలియన్ కంఫర్ట్ కోసం రియర్ గ్రిప్, USB ఛార్జర్‌తో వచ్చే ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, LED ల్యాంప్‌తో కూడిన పెద్ద అండర్ సీట్ స్టోరేజ్.. వంటివి 2023 హీరో మాస్ట్రో జూమ్ స్కూటర్ మరిన్ని ప్రత్యేకతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Hero moto corp