పవన్ ముంజాల్ నేతృత్వంలోని హీరో మోటో (Hero Moto) ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) మార్కెట్లోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ కంపెనీ హీరో విడా వీ1 (Hero Vida V1) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు మార్కెట్లో హీరో పేరుతో రిలీజ్ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు పవన్ ముంజాల్ నేతృత్వంలోని హీరో మోటోకి సంబంధించినవి కావు. కాగా అతనికి చెందిన హీరో మోటోకార్ప్ తాజాగా హీరో విడా (Hero Vida) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో రూ.1.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రైస్ ట్యాగ్‌తో పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్, ఓకినావా, బౌన్స్, హీరో ఎలక్ట్రిక్ వంటి కంపెనీల స్కూటర్లతో పోటీ పడుతుంది.
వేరియంట్స్, రేంజ్, మాక్సిమం స్పీడ్
ఈ ప్రీమియం ఈ-స్కూటర్ విడా వీ1 ప్రో (Vida V1 Pro), విడా వీ1 ప్లస్ (Vida V1 Plus) అనే రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిని హీరో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే లీజుకు తీసుకోవచ్చు. ఎంట్రీ-లెవల్ విడా V1 ప్లస్ గంటకు 80 కిమీల గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. 3.44kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఇది సింగిల్ ఛార్జ్‌పై 143 కి.మీల రేంజ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇక 3.94kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే V1 ప్రో కూడా అదే స్పీడ్‌తో నడుస్తుంది. ఈ స్కూటర్ 165 కిమీల రేంజ్ అందిస్తుంది. దీని ధరను ఏకంగా రూ.1.59 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.
Scooters: ఈ స్కూటర్లకు ఫుల్ డిమాండ్.. ఎగబడి కొనేస్తున్న జనం.. నిమిషానికొకటి ఫట్!
హీరో విడా V1 ప్రో ప్రతి నిమిషం ఛార్జింగ్‌కి 1.2కి.మీ ప్రయాణించగల ఫాస్ట్ ఛార్జింగ్ ఫంక్షన్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.2 సెకన్లలో 40kmph వేగాన్ని అందుకుంటుంది. ఇక విడా V1 ప్లస్ 0-40kmph స్పీడ్ చేరుకోవడానికి చేయడానికి 3.4 సెకన్లు పడుతుంది. హీరో Vida V1 స్కూటర్స్ ఎకో, రైడ్, స్పోర్ట్స్ అనే మూడు రైడ్ మోడ్లలో లభిస్తాయి. అలానే రైడర్ సౌలభ్యం కోసం మరో మోడ్‌ను ఆఫర్ చేస్తాయి. విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వివిధ భూభాగాల్లో 2 లక్షల కి.మీ, 25,000 గంటలపాటు విస్తృతంగా టెస్ట్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు సున్నా నుంచి 80 శాతం వరకు 65 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫాస్ట్ ఛార్జ్ అవుతాయి.
హీరో విడా V1ని అక్టోబర్ 10 నుంచి రూ.2,499 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. హీరో విడా V1 విక్రయాలు మొదట ఢిల్లీ , జైపూర్, బెంగళూరులలో ప్రారంభమవుతాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు డిసెంబర్ రెండవ వారం నుంచి స్టార్ట్ అవుతాయని కంపెనీ తెలిపింది.
హీరో విడా ఫీచర్స్
విడా స్కూటర్లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, బూస్ట్ మోడ్‌తో కూడిన ఇంటెలిజెంట్ 2-వే థ్రోటిల్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్, కీలెస్ కంట్రోల్, SOS అలర్ట్స్. ఈ రెండు వేరియంట్లు IP-68 రేటెడ్ డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. కంపెనీ ప్లస్ వేరియంట్‌ను మ్యాట్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్, గ్లోస్ బ్లాక్ అనే మూడు కలర్ స్కీమ్‌లలో అందిస్తోంది, Vida V1 ప్రో పైన పేర్కొన్న మూడు స్కీమ్‌లతో మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్‌తో కూడా వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes, Electric Scooter, Hero