April 1: పిడుగు లాంటి ప్రకటన చేశారుగా.. ఏప్రిల్ 1, 2021 నుంచి రూ.2,500 వరకూ పెరగబోతున్నట్లు చెప్పిన...

ప్రతీకాత్మక చిత్రం

గత కొద్దిరోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతుండటంతో పాటు గత అక్టోబర్ నుంచి ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బైక్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గడంతో సేల్స్ పడిపోయాయి. దీంతో పాటు తయారీకి సంబంధించిన వస్తువుల ఖర్చులు కూడా భారీగా పెరగడంతో...

 • Share this:
  ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1, 2021 నుంచి తమ టూ-వీలర్ ధరలు మరింత ప్రియం కానున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఒక్కో టూ-వీలర్‌పై రూ.2,500 పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఈ కంపెనీ షేర్లు 0.83 శాతం పతనం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో స్టీల్, కాపర్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని హీరో ప్రకటించింది. అయితే.. వినియోగదారులపై పూర్తి భారం పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. టూ-వీలర్ తయారీ సంస్థల్లో దిగ్గజ కంపెనీగా పేరొందిన హీరో ధరలను పెంచుతూ ప్రకటన చేయడంతో ఇతర కంపెనీలు కూడా అదే బాటను ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. పెంచిన ధర అన్ని మోడల్ బైక్స్‌కు ఒకే విధంగా ఉండదని, వినియోగదారుడు ఎంచుకునే మోడల్‌ను బట్టి పెంచిన ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయని హీరో సంస్థ ప్రకటించింది.

  గత కొద్దిరోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతుండటంతో పాటు గత అక్టోబర్ నుంచి ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బైక్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గడంతో సేల్స్ పడిపోయాయి. దీంతో పాటు తయారీకి సంబంధించిన వస్తువుల ఖర్చులు కూడా భారీగా పెరగడంతో హీరో మోటోకార్ప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆటోమొబైల్ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1, 2021 నుంచి భారత్‌లో టూ-వీలర్ ధరలు మరింత పెరగనున్నట్లు హీరో మోటోకార్ప్ తాజా ప్రకటన స్పష్టం చేసింది. హీరో స్కూటీలపై కూడా ఈ పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ కూడా తమ సంస్థ తయారుచేసే వాహనాల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నట్లు ప్రకటించింది.

  జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కూడా ఏప్రిల్ 1, 2021 నుంచి తమ కార్ల ధరలు పెరుగుతాయని వెల్లడించింది. ఒకపక్క ధరలను పెంచేస్తూనే.. మరోపక్క నూతన ఆవిష్కరణలకు హీరో సంస్థ తెరలేపింది. హీరో మోటోకార్ప్ మంగళవారం నాడు డెస్టినే 125 ప్లాటినమ్ ఎడిషన్ స్కూటీని లాంచ్ చేసింది. ఈ స్కూటీ ఢిల్లీ ఎక్స్-షోరూం ధరను రూ.72,050గా ఆ సంస్థ ప్రకటించింది. 125 సీసీతో ఈ స్కూటీని హీరో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్లెజర్, ప్లాటినమ్ ఎడిషన్‌ సక్సెస్ కావడంతో హీరో ఆ విశ్వాసంతోనే తాజాగా డెస్టినీ 125 స్కూటీని విడుదల చేసింది. బీఎస్-6 ప్రోగ్రామ్‌డ్ ఫ్యూయల్ ఇంజక్షన్ ఇంజిన్‌తో ఈ స్కూటీ రూపొందింది.
  Published by:Sambasiva Reddy
  First published: