HERO MOTOCORP TEASES UPCOMING ELECTRIC SCOOTER AT 10 YEAR ANNIVERSARY CELEBRATIONS NS GH
Hero MotoCorp: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి హీరో మోటోకార్ప్.. త్వరలోనే తొలి ఈ-స్కూటర్ లాంఛ్
ఎలక్ట్రిక్ స్కూటర్ తో సంస్థ సీఈఓ
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన10వ వార్షికోత్సవం సందర్భంగా తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు రాబోయే ఈ-స్కూటర్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది.
భారత్‌లో భవిష్యత్తు అంతా విద్యుత్ వాహనాలదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. పర్యావరణ కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఆటో సంస్థలు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నాయి. దేశంలో మొత్తం వాహనాల అమ్మకాల్లో 75 శాతం వాటా ద్విచక్రవాహనాలదే ఉంది. దీంతో ఇప్పటికే పలు టూవీలర్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా ముందడుగు వేశాయి. రాబోయే కాలంలో మెరుగైన మార్కెట్ వాటా పొందడమే లక్ష్యంగా భారత ద్విచక్రవాహన సంస్థలు తమ ఈవీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి, ఈ క్రమంలోనే ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన10వ వార్షికోత్సవం సందర్భంగా తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు రాబోయే ఈ-స్కూటర్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. తాజాగా నిర్వహించిన లైవ్-స్ట్రీమ్ ఈవెంట్లో హీరో మోటోకార్ప్ ఛైర్మన్, ఎండి, సిఈఓ డాక్టర్ పవన్ ముంజల్ దీని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ–స్కూటర్ స్పెసిఫికేషన్, లాంచ్ డేట్ గురించి ఎలాంటి వివరాలు ప్రకటించనప్పటికీ, అతి త్వరలోనే దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు రాని రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి Free Petrol: బంపరాఫర్.. ఆ పేరు ఉన్నవారందరికీ ఫ్రీగా రూ. 501 పెట్రోల్.. ఎక్కడంటే
కాగా, ఈవెంట్లో ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సైడ్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే.. ఈ వాహనం ఫ్రంట్ వీల్12 అంగుళాలు, బ్యాక్ వీల్10 అంగుళాల సైజ్‌తో వస్తుంది. వీల్ 5- స్పోక్ అల్లాయ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ ఉండగా, వెనుక భాగంలో మోనో-షాక్ అబ్జార్బర్‌ను అమర్చారు. దీని ఫ్రంట్ ఎండ్ ఒక స్లైడ్ ఆప్రాన్, ఫ్లైస్క్రీన్‌తో రూపొందింది. సీట్ల వెనుక భాగంలో చిన్న గ్రాబ్-రైల్‌తో స్ప్లిట్ డిజైన్‌ను అందించింది.
గోగోరో బ్యాటరీస్తో ఒప్పందం..
హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చేందుకు శరవేగంగా పనిచేస్తోంది. రాబోయే కాలంలో భారత్‌లో ఎలక్ట్రిక్ మార్కెట్ హవా కొనసాగనుండటంతో తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలలో, బ్యాటరీ మార్పిడి సాంకేతికతను భారతదేశానికి తీసుకురావడానికి తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
అయితే, తాజా ఈవెంట్లో ప్రదర్శించిన స్కూటర్ గోగోరో ఈవీతో రూపొందించింది కాకపోవడం గమనార్హం. భారత ద్విచక్రవాహన మార్కెట్లో హీరో మోటోకార్ప్ ఇప్పటికీ పాపులర్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ఇతర బ్రాండ్లకు గట్టిపోటీనివ్వనుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.