Hero MotoCorp: ఎలక్ట్రిక్​ వాహన మార్కెట్​లోకి హీరో మోటోకార్ప్... త్వరలోనే తొలి ఇ-స్కూటర్​

Hero MotoCorp: ఎలక్ట్రిక్​ వాహన మార్కెట్​లోకి హీరో మోటోకార్ప్... త్వరలోనే తొలి ఇ-స్కూటర్​

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి తొలి ఇ-స్కూటర్ రాబోతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

  • Share this:
భారత్​లో భవిష్యత్తు అంతా విద్యుత్​ వాహనాలదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. పర్యావరణ కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఆటో సంస్థలు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నాయి. దేశంలో మొత్తం వాహనాల అమ్మకాల్లో 75 శాతం వాటా ద్విచక్రవాహనాలదే ఉంది. దీంతో ఇప్పటికే పలు టూవీలర్​ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా ముందడుగు వేశాయి. రాబోయే కాలంలో మెరుగైన మార్కెట్​ వాటా పొందడమే లక్ష్యంగా భారత ద్విచక్రవాహన సంస్థలు తమ ఈవీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి, ఈ క్రమంలోనే ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​ తన10వ వార్షికోత్సవం సందర్భంగా తొలి ఎలక్ట్రిక్​ బైక్​ను లాంచ్​ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు రాబోయే ఈ-స్కూటర్​కు సంబంధించిన టీజర్​ను రిలీజ్​ చేసింది.

PM Ujjwala Scheme 2.0: ఉచితంగా గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్... అప్లై చేయండి ఇలా

IRCTC: ఐఆర్‌సీటీసీ బిజినెస్ ఆఫర్... నెలకు రూ.80,000 సంపాదించండి ఇలా

తాజాగా నిర్వహించిన లైవ్-స్ట్రీమ్ ఈవెంట్‌లో హీరో మోటోకార్ప్ ఛైర్మన్, ఎండి, సిఈఓ డాక్టర్ పవన్ ముంజల్ దీని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ–స్కూటర్​ స్పెసిఫికేషన్, లాంచ్ డేట్​ గురించి ఎలాంటి వివరాలు ప్రకటించనప్పటికీ, అతి త్వరలోనే దీన్ని మార్కెట్​లోకి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈవెంట్‌లో ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సైడ్ ప్రొఫైల్​ను పరిశీలిస్తే.. ఈ వాహనం ఫ్రంట్​ వీల్​12 అంగుళాలు, బ్యాక్​ వీల్​10 అంగుళాల సైజ్​తో వస్తుంది. వీల్ 5- స్పోక్ అల్లాయ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ ఉండగా, వెనుక భాగంలో మోనో-షాక్ అబ్జార్బర్​ను అమర్చారు. దీని ఫ్రంట్ ఎండ్ ఒక స్లైడ్​ ఆప్రాన్, ఫ్లైస్క్రీన్​తో రూపొందింది. సీట్ల వెనుక భాగంలో చిన్న గ్రాబ్-రైల్‌తో స్ప్లిట్ డిజైన్‌ను అందించింది.

Online Business: రూ.12 లక్షల పెట్టుబడితో బిజినెస్... కోట్ల రూపాయల టర్నోవర్

Aadhaar Number: ఆధార్ నెంబర్ వెరిఫై చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

గోగోరో బ్యాటరీస్​తో ఒప్పందం


హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చేందుకు శరవేగంగా పనిచేస్తోంది. రాబోయే కాలంలో భారత్​లో ఎలక్ట్రిక్​ మార్కెట్​ హవా కొనసాగనుండటంతో తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ నెలలో, బ్యాటరీ మార్పిడి సాంకేతికతను భారతదేశానికి తీసుకురావడానికి తైవాన్​కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అయితే, తాజా ఈవెంట్‌లో ప్రదర్శించిన స్కూటర్ గోగోరో ఈవీతో రూపొందించింది కాకపోవడం గమనార్హం. భారత ద్విచక్రవాహన మార్కెట్​లో హీరో మోటోకార్ప్ ఇప్పటికీ పాపులర్​ బ్రాండ్​గా కొనసాగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ మార్కెట్​లోకి ప్రవేశించిన తర్వాత ఇతర బ్రాండ్లకు గట్టిపోటీనివ్వనుంది.
Published by:Santhosh Kumar S
First published: