Home /News /business /

HERO MOTOCORP SHOCKING NEWS FOR TWO WHEELER BUYERS HERO BIKE SCOOTY PRICES TO GO UP TO RS 2000 FULL DETAILS HERE GH VB

Hero MotoCorp: టూవీలర్​ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఏప్రిల్ 5లోపు కొనేయండి.. లేదంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ టూవీలర్​ కొనుగోలుదారులకు షాకిచ్చింది. తన అన్ని బైక్​, స్కూటర్​ మోడళ్లపై రూ. 2 వేల వరకు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

ఇంకా చదవండి ...
భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) టూవీలర్​(Two Wheeler) కొనుగోలుదారులకు షాకిచ్చింది. తన అన్ని బైక్(Bike)​, స్కూటర్​ మోడళ్లపై రూ. 2 వేల వరకు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. పెరుగుతున్న కమోడిటీ ఖర్చులను అధిగమించేందుకు ధరల పెంపు అనివార్యత ఏర్పడిందని పేర్కొంది. ‘‘కమోడిటీల ధరలు పెరగడంతో ధరల పెంపు తప్పనిసరిగా మారింది. మోడల్​ను బట్టి ధరల పెంపు రూ.2 వేల వరకు ఉంటుంది. అయితే, ఈ పెరుగుదల నిర్దిష్ట మోడల్, మార్కెట్‌కు లోబడి ఉంటుంది.’’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టయోటా కిర్లోస్కర్ మోటార్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్‌తో సహా వివిధ కంపెనీలు సైతం ఇటీవలే ధరల పెంపును ప్రకటించాయి. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా వచ్చే నెల నుండి తమ ఉత్పత్తుల ధరల పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందని తెలిపాయి.

హీరో మోటోకార్ఫ్​పై ఐటీ దాడులు
మరోవైపు, మరోవైపు హీరో మోటోకార్ప్‌లో పెద్ద ఎత్తున బోగస్ ఖర్చులు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 23 నుంచి 26 మధ్యలో హీరో మోటోకార్ప్‌పై ఐటీ చేపట్టిన దాడులలో రూ. వెయ్యి కోట్ల మేర బోగస్ ఖర్చులను ఈ శాఖ గుర్తించినట్టు రిపోర్టులు వెలువడ్డాయి. దీంతో ఈ ఆటో దిగ్గజం షేర్లు కుప్పకూలాయి. ఈ రిపోర్టులు వెలువడిన తర్వాత హీరో మోటోకార్ప్ షేరు ధర 7.08 శాతం వరకు తగ్గి రూ.2,208.35కు పడిపోయింది. ఐటీ శాఖ గత వారం ఢిల్లీ, గూర్గావ్​తో పాటు 40కి పైగా ఆఫీసులపై రైడ్స్ చేపట్టింది. అంతేకాక కంపెనీ సీఈవో, ఛైర్మన్ పవన్ ముంజాల్‌పై నివాసంపై కూడా దాడులు చేసింది.

Employees: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్ షా.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. వివరాలిలా..


ఆయన ఢిల్లీ శివార్లలోని ఫామ్‌హౌస్ కొనుగోలులో రూ.100 కోట్లకు పైగా నగదు లావాదేవీలు చేసినట్లు ఐటీ శాఖ ఆధారాలను కనుగొంది. అంతేకాదు,​ ఛత్తర్‌పూర్‌లో ఒక ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారని తేలింది. అక్కడ పన్నును ఆదా చేసేందుకు ఫామ్‌హౌస్ మార్కెట్ ధరను తారుమారు చేశారని, రూ.100 కోట్ల పైగా నగదు చెల్లించడానికి నల్లధనాన్ని ఉపయోగించారని తేలింది. ఇది ఐటీ చట్టంలోని సెక్షన్ 269 SS ఉల్లంఘన కిందికి వస్తుంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SS ప్రకారం, స్థిరాస్తి కొనుగోళ్లపై లావాదేవీలు చేస్తున్నప్పుడు, విక్రేత కొనుగోలుదారు నుండి రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించినట్లయితే 100% జరిమానా విధిస్తారు. అయితే, కంపెనీ సీఈవోపై దాడులు జరిగిన తర్వాతి రోజే బైక్​, స్కూటర్ల ధరల పెంపు నిర్ణయం వెలువడటం గమనార్హం.
Published by:Veera Babu
First published:

Tags: Hero, Hero moto corp, Two wheelers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు