హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hero Xtreme: ఇండియాలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160R స్టీల్త్ 2.0 ఎడిషన్ బైక్ లాంచ్.. ధర రూ.1.30 లక్షలు..

Hero Xtreme: ఇండియాలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160R స్టీల్త్ 2.0 ఎడిషన్ బైక్ లాంచ్.. ధర రూ.1.30 లక్షలు..

Hero Xtreme 160R Stealth 2.0 Edition (Photo: Hero MotoCorp)

Hero Xtreme 160R Stealth 2.0 Edition (Photo: Hero MotoCorp)

Hero Xtreme: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ నుంచి కొత్త వెహికల్ లాంచ్ అయింది. కంపెనీ ఎక్స్‌ట్రీమ్ 160R మోడల్‌లో తాజాగా అప్‌డేటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) నుంచి కొత్త వెహికల్ లాంచ్ అయింది. కంపెనీ ఎక్స్‌ట్రీమ్ 160R మోడల్‌లో తాజాగా అప్‌డేటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ‘హీరో ఎక్స్‌ట్రీమ్ 160R స్టీల్త్ 2.0 ఎడిషన్’ (Xtreme 160R Stealth 2.0) పేరుతో రిలీజ్ అయిన ఈ కొత్త బైక్ రూ.1.30 లక్షల ఎక్స్-షోరూమ్‌ ధరతో మార్కెట్లోకి వచ్చింది. మిస్టీరియస్ మ్యాట్ బ్లాక్ షేడ్‌లో బైక్ లవర్స్‌ను ఆకర్షిస్తున్న ఈ కొత్త మోడల్.. హీరో కనెక్ట్ ఫీచర్ సాయంతో మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. కొత్త అప్‌డేట్స్‌తో ఇండియన్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న ఈ బైక్ స్పెసిఫికేషన్లు చూద్దాం.

ఇండియన్ మార్కెట్‌లో ఎక్స్‌ట్రీమ్ 160R మోడల్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ (CGO) రంజీవ్‌జిత్ సింగ్. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్తగా ఎక్స్‌ట్రీమ్ 160R స్టీల్త్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసి ప్రొఫైల్‌ను 2.0 ఎడిషన్‌ను లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు. కొత్త వేరియంట్ స్టైల్, సేఫ్టీ, కనెక్టివిటీ, సెక్యూరిటీ స్పెసిఫికేషన్లతో వస్తుందన్నారు.

* ఇంజిన్ కెపాసిటీ

ఎక్స్‌ట్రీమ్ 160R స్టెల్త్ 2.0 ఎడిషన్ 163cc ఎయిర్ కూల్డ్ BS-VI కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 6,500 rpm వద్ద 15 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ XSens టెక్నాలజీ, లేటెస్ట్ ప్రోగ్రామ్డ్-ఫ్యూయల్-ఇంజెక్షన్‌ సిస్టమ్‌ సపోర్ట్‌తో వస్తుంది. దీని సాయంతో మోటార్‌సైకిల్‌ కేవలం 4.7 సెకన్లలోనే 60 kmph స్పీడ్‌ను అందుకోగలదు.

* డిజైన్, ఫీచర్లు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160R స్టెల్త్ 2.0 ఎడిషన్ బైక్‌లోని టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్, పిలియన్ గ్రిప్‌పై రెడ్ యాక్సెంట్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది నకిల్ గార్డ్స్‌తో బాడీ అట్రాక్టివ్‌గా ఉంది. హీరో బైక్స్‌ స్సెషాలిటీ అయిన ‘హీరో కనెక్ట్’ యాప్.. జియో ఫెన్సింగ్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, టాపల్ అలర్ట్, టో అవే అలర్ట్, అన్‌ప్లగ్ అలర్ట్ వంటి ఐదు స్పెషల్ అలర్ట్స్‌ను అందిస్తుంది.

ఇది కూడా చదవండి : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మారిన ఫుడ్ మెనూ.. ఇక, చాక్లెట్ బార్స్ ఉండవు.. వాటి స్థానంలో..

కొత్త బైక్ లాంచ్ సందర్భంగా మాట్లాడారు హీరో మోటోకార్ప్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లే మాసన్. ఇండియన్ మార్కెట్‌లో సక్సెస్ అయిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160R స్టీల్త్ ఎడిషన్ బైక్ ఎంతోమంది రైడర్లకు బెస్ట్ చాయిస్‌గా నిలిచిందని చెప్పారు. దీంతో దీనికి కొత్త, అప్‌డేటెడ్ వెర్షన్‌గా 160R స్టెల్త్ 2.0 ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. రెడ్ కలర్ యాక్సెంట్స్‌తో పాటు తమ క్లౌడ్ కనెక్ట్ సిస్టమ్ కనెక్ట్ 1.0ను అందిస్తున్నట్లు వెల్లడించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Hero, New bike

ఉత్తమ కథలు