హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hero Vida V1: హీరో నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది... హీరో వీదా వీ1 ప్రత్యేకతలివే

Hero Vida V1: హీరో నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది... హీరో వీదా వీ1 ప్రత్యేకతలివే

Hero Vida V1: హీరో నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది... హీరో వీదా వీ1 ప్రత్యేకతలివే

Hero Vida V1: హీరో నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది... హీరో వీదా వీ1 ప్రత్యేకతలివే

Hero Vida V1 | హీరో మోటోకార్ప్ నుంచి వీదా వీ1 పేరుతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. వీదా వీ1 ప్రో, వీదా వీ1 ప్లస్ ఇ-స్కూటర్లు (e-Scooter) లాంఛ్ అయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

హీరో మోటోకార్ప్ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) లాంఛ్ అయింది. వీదా వీ1 సిరీస్‌లో వీదా వీ1 ప్రో (Vida V1 Pro), వీదా వీ1 ప్లస్ (Vida V1 Plus) పేరుతో కంపెనీ రెండు ఇ-స్కూటర్లను (e-Scooter) లాంఛ్ చేసింది. హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,45,000. ఇది ఎక్స్ షోరూమ్ ధర. వీదా అంటే స్పానిష్‌లో లైఫ్ అని అర్థం. ఆ పేరుతో రెండు స్కూటర్లను పరిచయం చేసింది. హీరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్‌లో వీదా వీ1 స్కూటర్లను కొనొచ్చు. జైపూర్‌లోని హీరో సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ టెక్నాలజీలో హీరో మోటోకార్ప్ వీదా స్కూటర్‌ను రూపొందించడం విశేషం.

హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ జూలై 1న లాంఛ్ కావాల్సి ఉండగా, సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా లాంఛింగ్ ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తయారీ యూనిట్‌లో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనుంది హీరో మోటోకార్ప్. వీదా వీ1 ప్రో, వీదా వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చెతక్, ఏథర్ 450X లాంటి మోడల్స్‌కు పోటీ ఇవ్వనున్నాయి.

Jawa 42 Bobber: జావా 42 బాబర్ లగ్జరీ బైక్ ప్రత్యేకతలు ఇవే

వీదా వీ1 స్కూటర్ల ప్రత్యేకతలివే

వీదా వీ1 ప్రో న్యూ ఢిల్లీ , జైపూర్, బెంగళూరులో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ.1,45,000. ఫేమ్ 2 సబ్సిడీ, పోర్టబుల్ ఛార్జర్ కలిపి ఈ ధరను ప్రకటించింది కంపెనీ. ఇందులో 3.94 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 65 నిమిషాల సమయం పడుతుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకండ్లలో అందుకోవచ్చు.

వీదా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్లలో టూవే థ్రాటల్, క్రూజ్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, పార్కింగ్ కోసం అసిస్టెన్స్, డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకునే ఫీచర్స్ ఉన్నాయి. ఇకో, రైడ్, స్పోర్ట్స్, కస్టమ్ మోడ్‌లో డ్రైవ్ చేయొచ్చు. వీదా వీ1 ప్రో ఫీచర్స్ లాగానే వీదా వీ1 ప్లస్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 3.4 kWh బ్యాటరీ ఉంటుంది.

EPF Interest: ఈపీఎఫ్ వడ్డీ జమ కాలేదా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీదా వీ1 ఫీచర్స్ చూస్తే ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్, కీలెస్ కంట్రోల్, ఎస్ఓఎస్ అలర్ట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రెండు మోడల్స్‌లో డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఐపీ 68 రేటింగ్ ఉండటం విశేషం. వీదా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వేర్వేరు భూభాగాలపై 25,000 గంటల పాటు, రెండు లక్షల కిలోమీటర్ల దూరం టెస్ట్ చేసినట్టు కంపెనీ ప్రకటించింది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Electric Scooter, Ev scooters, Hero moto corp, SCOOTER

ఉత్తమ కథలు