Home /News /business /

HERO MOTOCORP HIKES TWO WHEELERS PRICE BY UP TO RS 1000 KMV

Price Hike: పండుగ సీజన్‌లో బైక్, స్కూటర్ కొనాలనుకునే వారికి షాక్..

పండుగ సీజన్‌లో బైక్ కొనాలనుకునే వారికి షాక్..

పండుగ సీజన్‌లో బైక్ కొనాలనుకునే వారికి షాక్..

Hero Price Hike | దసరా వస్తోంది. లేదంటే దీపావళి. ఇది మంచి పండుగ సీజన్. చాలా మంది ఈ పండుగ సీజన్‌లో షాపింగ్ చేస్తుంటారు. కొందరు ఇంట్లోకి వాషింగ్ మెషీన్, టీవీ, ఫ్రిజ్ వంటివి కొంటే.. ఇంకొంత మంది మాత్రం బైక్, స్కూటర్, కారు వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Hero MotoCorp Price Hike | మీరు ఈ పండుగ సీజన్‌లో కొత్త బైక్ (Bike) లేదా స్కూటర్ (Scooter) కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే.. మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ టూవీలర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ తాజాగా ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. దీని వల్ల హీరో బైక్ లేదా స్కూటర్ కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. హీరో మోటొకార్ప్ టూవీలర్ ధరల పెంపు నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. అంటే నేటి నుంచే కంపెనీ బైక్ , స్కూటర్ ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల వల్ల వాహన ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని హీరో మోటొకార్ప్ వివరణ ఇచ్చింది. ధరల పెంపు రూ. 1000 వరకు ఉంటుందని వెల్లడించింది. అయితే మోడల్ ప్రాతిపదికన రేట్ల పెంపు మారుతూ ఉంటుందని వివరణ ఇచ్చింది. ఆధార్ కార్డుదారులకు కొత్త సేవలు.. ఇక మరింత భద్రంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు! మరోవైపు హీరో మోటొకార్ప్ ఇంకో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు సంబంధించి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం హీరో మోటొకార్ప్.. హెచ్‌పీసీఎల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన డీల్‌లో భాగంగా హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నారు. 7 నెలల కనిష్టానికి కుప్పకూలిన బంగారం ధర.. కారణం ఇదే! నేటి రేట్లు ఇలా తొలి దశలో ఎంపిక చేసిన పట్టణాల్లో మాత్రమే చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తర్వాత ప్రధాన మార్కెట్లలో ఈ సేవలను విస్తరిస్తారు. ఈ చార్జింగ్ స్టేషన్లలో ఫాస్ట్ చార్జర్లు, డీసీ అండ్ ఏసీ చార్జర్లు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని రకాల ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఈ చార్జింగ్ స్టేషన్లలో చార్జింగ్ పెట్టుకోవచ్చు. కాగా కంపెనీ వచ్చే నెలలో తన తొలి ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ‘20,000 కన్నా ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్స్‌ను కలిగి ఉన్నాం. ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటొకార్ప్ కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. దీంతో ఇరు కంపెనీల భాగస్వామ్యం వల్ల పాన్ ఇండియా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి, పూర్తి స్థాయి ఈవీ ఛార్జింగ్ సేవలను అందించడానికి వీలు కలుగుతుంది’ అని హెచ్‌పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పుష్ప కుమార్ జోషి పేర్కొన్నారు. దేశంలో విక్రయిస్తున్న ఈవీలలో 60 శాతానికి పైగా టూవీలర్లు ఉన్నాయని, ఇరు కంపెనీల వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల చాలా మందికి ఊరట కలుగుందని తెలిపారు.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Bike, Hero, Hero Electric Scooter, Hero moto corp, SCOOTER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు