Home /News /business /

HERO MOTOCORP HIKES PRICES OF MOTORCYCLES AND SCOOTERS UP TO RS 2000 WITH EFFECT FROM 2022 JANUARY 4 SS

Hero MotoCorp: హీరో మోటార్ సైకిళ్ల ధరల పెంపు... ఎంతంటే

Hero MotoCorp: హీరో మోటార్ సైకిళ్ల ధరల పెంపు... ఎంతంటే

Hero MotoCorp: హీరో మోటార్ సైకిళ్ల ధరల పెంపు... ఎంతంటే

Hero MotoCorp | హీరో స్ప్లెండర్, ప్యాషన్, మ్యాస్ట్రో లాంటి టూవీలర్స్ కొనాలంటే ఈ నెలాఖరులోగా కొనండి. జనవరి 1 నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఎంతో తెలుసుకోండి.

    హీరో మోటార్ సైకిల్ కొనాలనుకునేవారికి అలర్ట్. ఆటోమొబైల్ దిగ్గజం అయిన హీరో మోటోకార్ప్ టూవీలర్ల ధరల్ని (Two Wheeler Prices) పెంచుతున్నట్టు ప్రకటించింది. 2022 జనవరి 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఎక్స్-షోరూమ్ ధరలపై రూ.2,000 వరకు పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. కమాడిటీ ధరలు పెరిగిన కారణంగా టూవీలర్ల ధరల్ని పెంచాల్సి వస్తున్నట్టు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఒక మోటార్ సైకిల్‌పై ఎంత పెరుగుతుందనేది ఆ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. హీరో మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఏ టూవీలర్‌పై ఎంత పెరిగిందో స్పష్టత రావాల్సి ఉంది.

    హీరో మోటోకార్ప్ టూవీలర్లు, స్కూటర్ల ధరల్ని పెంచడం ఇదే మొదటిసారి కాదు. గత ఆరు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఏడాది జూలై 1న హీరో మోటార్ సైకిళ్లు, స్కూటర్లపై ఎక్స్ షోరూమ్ ధర రూ.3,000 వరకు పెరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 20న ధర మరోసారి రూ.3,000 వరకు పెరిగింది. ఇప్పుడు మరో రూ.2,000 పెరిగింది. అప్పుడు కూడా కమాడిటీ ధరలు పెరగడం వల్లే వాహనాల ధరల్ని పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్ తెలపడం విశేషం. దీంతో గత ఆరు నెలల్లోనే హీరో బైకులు, స్కూటర్లపై ఏకంగా రూ.8,000 వరకు ధర పెరిగినట్టైంది.

    Post Office Scheme: ఈ పథకంలో చేరితే ప్రతీ నెలా ఆదాయం... పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వివరాలివే

    హీరో మోటోకార్ప్ మాత్రమే కాదు... కవాసాకి ఇండియా కూడా మోటార్ సైకిళ్ల ధరల్ని భారీగా పెంచింది. వేర్వేరు మోడళ్లపై రూ.23,000 వరకు ధర పెరగడం విశేషం. పెరిగిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే కస్టమర్లకు ప్రైస్ ప్రొటెక్షన్ ఆఫర్ ప్రకటించింది కవాసాకి ఇండియా. 2021 డిసెంబర్ 31 లోగా బుక్ చేసి 45 రోజుల్లో డెలివరీ తీసుకునే కస్టమర్లకు పాత ధరలే ఉంటాయి. 2022 జనవరి 1 నుంచి బుక్ చేసేవారికి మాత్రం కొత్త ధరలు ఉంటాయి. కవాసాకి ఇండియా లేటెస్ట్‌గా లాంఛ్ చేసిన Ninja ZX-10R మోడల్ ధర కూడా పెరిగింది. నింజా 300 బైక్‌పై రూ.6,000 పెరిగింది.

    Indian Railways: అలర్ట్... రైలులో దూర ప్రయాణమా? టికెట్లతో పాటు ఇవి కూడా కొనాలి

    హీరోమోటోకార్ప్, కవాసాకి ఇండియా మాత్రమే కాదు... మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్, టాటా మోటార్స్, హోండా కార్స్, టొయోటా లాంటి కంపెనీలు కూడా ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీలన్నీ జూలై-ఆగస్ట్ నెలల్లోనే ధరల్ని పెంచాయి. స్టీల్, ఇతర మెటల్స్, రా మెటీరియల్ ధరలు పెరగడంతో ఈ కంపెనీలన్నీ వాహనాల ధరల్ని పెంచాయి. ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో సేల్స్ లేకపోవడం, మరోవైపు విడిభాగాల ధరలు పెరిగిపోవడంతో 2021 ప్రారంభం నుంచి వాహన తయారీ సంస్థలన్నీ ధరల్ని పెంచుతూ వస్తున్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bike, Hero moto corp, Two wheeler

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు