• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HERO MOTOCORP EXTENDS WARRANTY AND FREE SERVICE TILL JUNE 30 DUE TO CORONAVIRUS OUTBREAK SS

Hero MotoCorp: కరోనావైరస్ ఎఫెక్ట్... హీరో బైక్ కొన్నవారికి శుభవార్త

Hero MotoCorp: కరోనావైరస్ ఎఫెక్ట్... హీరో బైక్ కొన్నవారికి శుభవార్త

Hero MotoCorp: కరోనావైరస్ ఎఫెక్ట్... హీరో బైక్ కొన్నవారికి శుభవార్త (ప్రతీకాత్మక చిత్రం)

Hero Motocorp | సేల్స్, ఆఫ్టర్ సేల్స్, సర్వీస్, వారెంటీ లాంటి సందేహాలు ఉన్నవారు 24 గంటలు పనిచేసే టోల్‌ఫ్రీ నెంబర్ 18002660018 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.

  • Share this:
    కరోనావైరస్ ప్రభావం కారణంగా హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతున్నందున తమ బైకులు కొన్న కస్టమర్లకు వారెంటీ, ఫ్రీ సర్వీస్, ఏఎంసీ సర్వీస్ గడువును పొడిగించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఫ్రీ సర్వీస్ ముగిసేవారందరికీ గడువును 2020 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 మధ్య కాలంలో హీరో బైకులపై ఫ్రీ సర్వీస్ లేదా వారెంటీ ముగిసినా వాహనదారులు జూన్ 30 వరకు వాటిని పొందొచ్చు. లాక్‌డౌన్ కారణంగా సేవలు అందించలేని పరిస్థితి నెలకొనడంతో హీరో మోటోకార్ప్ ఈ నిర్ణయం తీసుకుంది. హీరో బైకులు, స్కూటర్లకు ఇది వర్తిస్తుంది.


    ఇక స్థానిక అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నట్టు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. సేల్స్, ఆఫ్టర్ సేల్స్, సర్వీస్, వారెంటీ లాంటి సందేహాలు ఉన్నవారు 24 గంటలు పనిచేసే టోల్‌ఫ్రీ నెంబర్ 18002660018 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.

    ఇవి కూడా చదవండి:

    Arogya Sanjeevani: ఆరోగ్య సంజీవని పాలసీ ప్రారంభంచిన బజాజ్ అల్లియాంజ్... బెనిఫిట్స్ ఇవే

    Insurance Policy: ఎల్ఐసీతోపాటు ఇతర పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్

    Savings Account: ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్‌తో ఎక్కువ లాభం... తెలుసుకోండి
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు