హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hero MotoCorp: డెస్టినీ 125 ఎక్స్‌టెక్‌ వేరియంట్‌ లాంచ్.. ఫీచర్లు, ఎక్స్ షోరూం ధరలు ఇలా..!

Hero MotoCorp: డెస్టినీ 125 ఎక్స్‌టెక్‌ వేరియంట్‌ లాంచ్.. ఫీచర్లు, ఎక్స్ షోరూం ధరలు ఇలా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ దిగ్గజ టూవీలర్ ఉత్పత్తిదారు హీరో మోటోకార్ప్ వాహనదారుల అభిరుచికి తగ్గట్టు మార్కెట్‌లోకి సరికొత్త మోడల్‌ను లాంచ్ చేస్తుంటుంది. అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. తాజాగా డెస్టినీ 125 ఎక్స్‌టెక్ పేరుతో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...

దేశీయ దిగ్గజ టూవీలర్(Two Wheeler) ఉత్పత్తిదారు హీరో మోటోకార్ప్(Hero MotoCorp) వాహనదారుల అభిరుచికి తగ్గట్టు మార్కెట్‌లోకి(Market) సరికొత్త మోడల్‌ను లాంచ్(Launch) చేస్తుంటుంది. అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. తాజాగా డెస్టినీ 125 ఎక్స్‌టెక్ పేరుతో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. న్యూ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎన్‌హాన్స్‌డ్ రెట్రో డిజైన్, క్రోమ్ ఎలిమెంట్స్‌తో స్కూటర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. డెస్టినీ 125 ఎక్స్‌టెక్ నెక్సస్ బ్లూ కలర్‌లో(Blue Color) లాంచ్ అయింది. మరీ, దీని ఎక్స్‌షోరూం ధర, ఫీచర్లలపై(Features) ఓ లుక్కేదాం. ఫీచర్లు ఇలా.. డెస్టినీ 125 ఎక్స్‌టెక్‌లో i3S టెక్నాలజీ, (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్), ఫ్రంట్ యూఎస్‌బీ ఛార్జర్, కాల్ & SMS అలర్ట్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో(Connectivity) డిజి అనలాగ్ స్పీడోమీటర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, సీట్ బ్యాక్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డెస్టినీ 125 XTEC స్కూటర్ రెండు వేరియంట్‌లలో విడుదలైంది. డెస్టినీ 125 XTEC టాప్ ఎండ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.79,990 (ఎక్స్-షోరూమ్)కాగా, ఇక స్టాండర్డ్ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.69,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త డెస్టినీ 125 XTEC లో మిర్రర్స్, మఫ్లర్ ప్రొటెక్టర్, హ్యాండిల్‌బార్‌పై ప్రీమియం క్రోమ్ ఎలిమెంట్స్, బ్యాడ్జింగ్, డ్యూయల్ టోన్ సీటు, కలర్డ్ ఇన్నర్ ప్యానెల్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌, సైడ్-స్టాండ్ విజువల్ ఇండికేషన్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్లు దీనిలో హైలైట్.

Suzuki Motorcycle: సుజుకి అవెనిస్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ధర ఎంతో తెలుసా..

హీరో మోటోకార్ప్‌ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ.... XTEC టెక్నాలజీ ప్యాకేజీ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుందన్నారు. XTEC టెక్నాలజీని మొదటగా గ్లామర్ 125, ప్లెజర్+ 110 ఎడిషన్లలో పరిచయం చేశామని... ప్రస్తుతం డెస్టినీ 125 మోడల్ XTEC టెక్నాలజీ‌పై ప్రజాదరణను మరింత బలోపేతం చేస్తుందన్నారు.

హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ... డెస్టినీ 125 స్కూటర్ కస్టమర్‌లతో బలమైన అనుసంధాన్ని కలిగి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విలక్షణమైన అనుభవం కోసం ఎదురుచూస్తున్న రైడర్‌లు బహుముఖ హీరో డెస్టినీ 125 XTEC వైపు ఆకర్షితులవుతారని ఆయన అన్నారు. కొత్త డెస్టినీ 125 XTEC తమ నిరంతర సాంకేతిక పురోగామికి చిరునామ లాంటిదన్నారు. ఇప్పుడు కొత్త 'XTEC అవతార్'లో, హీరో డెస్టినీ 125 మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.

హీరో డెస్టినీ 125 XTEC రూపొందించేటప్పుడు కంఫర్ట్, స్టైలింగ్‌పై ప్రత్యేక దృషిసారించామని.. దేశంలోని టూవీలర్ రంగాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని రంజీవ్‌జిత్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. రైడర్ డెస్టినీ 125 XTEC ద్వారా కనెక్టివిటీ ఫంక్షన్‌లను వేగంగా, సౌకర్యవంతంగా యాక్సెస్ చేయవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త డిజిటల్ అనలాగ్ స్పీడోమీటర్ ద్వారా రైడర్ ఇన్‌కమింగ్ అండ్ మిస్డ్ కాల్ అలర్ట్‌లు, కొత్త మెసేజ్ అలర్ట్‌లను ఈజీగా గుర్తించవచ్చు. టైమింగ్స్‌తో పాటు RTMI, తక్కువ ఇంధన సూచికను అది ప్రదర్శిస్తుంది. ముందు USB ఛార్జింగ్ పోర్ట్‌ను అందిస్తుంది.

First published:

Tags: Hero, Hero moto corp, Two wheelers

ఉత్తమ కథలు