హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hero MotoCorp: బైక్ కొనేవారికి పెద్ద షాక్.. భారీ ఎత్తున పెరిగిన రేట్లు.. జూలై 1 నుంచే అమలు..!

Hero MotoCorp: బైక్ కొనేవారికి పెద్ద షాక్.. భారీ ఎత్తున పెరిగిన రేట్లు.. జూలై 1 నుంచే అమలు..!

జూలై 1 నుంచి హీరో బైక్ ధరలు పెంపు.

జూలై 1 నుంచి హీరో బైక్ ధరలు పెంపు.

కొత్త బైక్ కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది హీరో మోటోకార్ప్. ఇండియాలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరుగా ఈ కంపెనీ.. జూలై 1 నుంచి అన్ని ప్రొడక్ట్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సంస్థ నుంచి వచ్చిన అన్ని రేంజ్‌ల మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 3,000

ఇంకా చదవండి ...

New Bike కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది హీరో మోటోకార్ప్. Indiaలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరుగా ఈ కంపెనీ.. జూలై 1 నుంచి అన్ని ప్రొడక్ట్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సంస్థ నుంచి వచ్చిన అన్ని రేంజ్‌ల Motor Bikes, స్కూటర్ల ధరలను రూ. 3,000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. కమోడిటీ ధరలతో సహా క్రమంగా పెరుగుతున్న కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ప్రభావాన్ని తట్టుకునేందుకు ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. మోడల్, మార్కెట్ ఆధారంగా పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో.. ‘కమోడిటీ ధరలతో సహా స్థిరంగా పెరుగుతున్న ఓవరాల్ కాస్ట్ ఇన్‌ఫ్లేషన్‌ను ఆఫ్‌సెట్ చేయడానికి ధరలు పెంచడం అవసరం’ అని కంపెనీ పేర్కొంది.

హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ఇంతకు ముందు కూడా ధరలను పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పుడు కూడా పెరుగుతున్న కమోడిటీ ధరల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ప్రొడక్ట్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో వివిధ బైక్‌లు, స్కూటర్లపై రూ. 2,000 వరకు ధరలు పెరిగాయి. హీరో మోటోకార్స్ ఎంట్రీ-లెవల్ HF100 మోటార్ సైకిల్ నుంచి అనేక రకాల మోడళ్లను విక్రయిస్తుంది. దీని ధరలు రూ. 51,450 నుంచి ప్రారంభమవుతాయి. హీరో ఎక్స్‌ పల్స్ 200 4V బైక్ ధర రూ. 1.32 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.

ఇదీ చదవండి: శాశ్వత సైనిక నియామకాల కోసం అగ్నివీరులకు నిరంతర పరీక్షలు.. లెఫ్టినెంట్ జనరల్ కీలక ప్రకటన


హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల తయారీదారు. 2022 మే నెలలో కంపెనీ 4,86,704 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 418,622 యూనిట్లను విక్రయించింది. అంటే ఒక నెలలో అమ్మకాలు 16 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ కేవలం 1,83,044 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కోవిడ్-19 కేసుల పెరుగుదల, లాక్‌డౌన్ల ప్రభావం అప్పట్లో అమ్మకాలపై ఏర్పడింది.

హీరో మోటోకార్ప్ ఇటీవల ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. EV వెంచర్ 'Vida - Powered by Hero' పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV)తో సహా మొబిలిటీ సొల్యూషన్స్ కోసం బ్రాండ్-న్యూ ఐడెంటిటీని స్థాపించింది. హీరో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్‌ను 2022 జూలై 1న అధికారికంగా ఆవిష్కరించనుంది. ఎమెరిటస్ ఛైర్మన్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ లాల్ జన్మదినోత్సవం సందర్భంగా కంపెనీ ఈ తేదీని ఎంచుకుంది. హీరో బ్రాండ్ పేరును నిలుపుకునే విషయంలో హీరో ఎలక్ట్రిక్‌తో విభేదాలు రావడంతో హీరో మోటోకార్ప్ కొత్త బ్రాండ్ పేరును పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కోర్టుకు కూడా వెళ్లింది. కోర్టు తీర్పుతో హీరో ఎలక్ట్రిక్.. హీరో ట్యాగ్‌పై హక్కులను పొందింది.

Published by:Mahesh
First published:

Tags: Auto News, Bike, Hero, Hero Electric Scooter

ఉత్తమ కథలు