Scooters | కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఏప్రిల్ 1 నుంచి బైక్స్, స్కూటర్ల ధరలు (Money) పెరగబోతున్నాయి. ఇప్పటికే దిగ్గట టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ (Hero) ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీని వల్ల కొత్తగా హీరో బైక్ లేదా స్కూటర్ కొనే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
బైక్స్, స్కూటర్ల ధర దాదాపు 2 శాతం వరకు పెరుగుతుందని హీరో మోటొకార్ప్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ఓబీడీ 1కు బదిలీ కావడం ద్వారా వ్యయాలు పెరుగుతున్నాయని, అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొందని కంపెనీ వివరించింది. కాగా దేశంలో ఏప్రిల్ 1 నుంచి విక్రయించే అన్ని టూవీలర్లు ఓబీడీ 1 నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి.
గ్యాస్ సిలిండర్ వాడే వారికి మోదీ భారీ శుభవార్త.. ఎల్‌పీజీ సబ్సిడీపై కీలక ప్రకటన!
అయితే ధరల పెంపు అనేది బైక్ , స్కూటర్ మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతుందని కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు నేపథ్యంలో కంపెనీ మాత్రం కస్టమర్లకు ఫైనాన్స్ విషయంలో భరోసా ఇస్తోంది. ఆకర్షణీయ ఫైనాన్స్ సదుపాయం అందిస్తామని పేర్కొంటోంది. అందువల్ల హీరో బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బెనిఫిట్ పొందొచ్చని తెలిపింది.
పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ భారీ ఊరట.. కీలక నిర్ణయం
కాగా హీరో మోటొకార్ప్ ధరల పెంపు నేపథ్యంలో ఇతర టూవీలర్ తయారీ కంపెనీలు కూడా వాటి బైక్స్, స్కూటర్ల ధరలను పెంచే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త రూల్స్ అన్ని టూవీలర్లకు వర్తిస్తాయి. ఈ లెక్కన చూస్తే.. కేవలం హీరో మోటొకార్ప్ మాత్రమే కాకుండా ఇతర టూవీలర్ తయారీ కంపెనీలు కూడా వాటి మోడళ్ల ధరలను పెంచే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.
అందువల్ల మీరు కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే ధరలు ఇంకా పెరగలేదు. అదే ఏప్రిల్ నెల వచ్చిందంటే మాత్రం ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. తద్వారా హీరో మోటొకార్ప్ బైక్స్, స్కూటర్ల ధరలు కూడా పైపైకి చేరుతాయి. కాగా ఇప్పటికే చాలా మంది ఉగాది ఫెస్టివల్‌కు వెహికల్ కొనుగోలు చేసి ఉండొచ్చు. ఇంకా లేదంటే మాత్రం కొనే ప్లానింగ్‌లో ఉంటే.. వెంటనే ఆకర్షణీయ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆలస్యం చేస్తే.. ఆఫర్లతో పాటుగా అధికంగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bikes, Hero moto corp, Price Hike, SCOOTER