హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hero Offers: ఒక్క బైక్ కొంటే 6 ఆఫర్స్... రూ.13,500 వరకు బెనిఫిట్స్

Hero Offers: ఒక్క బైక్ కొంటే 6 ఆఫర్స్... రూ.13,500 వరకు బెనిఫిట్స్

Hero Offers: ఒక్క బైక్ కొంటే 6 ఆఫర్స్... రూ.13,500 వరకు బెనిఫిట్స్
(Photo: Hero MotoCorp)

Hero Offers: ఒక్క బైక్ కొంటే 6 ఆఫర్స్... రూ.13,500 వరకు బెనిఫిట్స్ (Photo: Hero MotoCorp)

Hero Offers | హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) సూపర్ 6 ధమాకా ఆఫర్స్ అందిస్తోంది. ఒక్క బైక్ కొంటే 6 ఆఫర్స్ పొందొచ్చు. రూ.13,500 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

దీపావళికి కొత్త బండి కొనాలనుకుంటున్నారా? బైక్ లేదా స్కూటర్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? టూవీలర్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్ట్ (GIFT) పేరుతో ఫెస్టివల్ సేల్ ప్రారంభించిన హీరో మోటోకార్ప్... సూపర్ 6 ధమాకా పేరుతో ఏకంగా 6 ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆరు ఆఫర్స్‌తో రూ.13,500 వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. మోటార్ సైకిళ్లు, స్కూటర్లపై రీటైల్ బెనిఫిట్స్, ఫైనాన్సింగ్ స్కీమ్స్, ప్రీ-బుకింగ్ ఆఫర్స్ అందిస్తోంది. హీరో ఎక్స్‌స్ట్రీమ్ 160ఆర్, హీరో గ్లామర్, హీరో స్ప్లెండర్+, హీరో ప్లెజర్+, హెచ్ఎఫ్ డీలక్స్ లాంటి మోడల్స్‌ని కొత్తగా పరిచయం చేస్తోంది.

హీరో మోటోకార్ప్ అందిస్తున్న సూపర్ 6 ధమాకా ఆఫర్స్ వివరాలు చూస్తే మొదటి ఆఫర్‌లో ఒక ఏడాది ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ లభిస్తుంది. రెండో ఆఫర్ కింద రెండేళ్ల ఉచిత మెయింటనెన్స్ అందిస్తోంది. ఇక మూడో ఆఫర్‌లో రూ.3,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ అదనంగా ఇస్తోంది. నాలుగో ఆఫర్ కింద రూ.4,000 గుడ్‌లైఫ్ వోచర్ ఇవ్వనుంది. ఐదో ఆఫర్ కింద ఐదేళ్ల వారెంటీ ఇస్తోంది. ఇక ఆరో ఆఫర్ కింద ఆరు నెలల సున్నా శాతం వడ్డీకే రుణ సదుపాయం ఇస్తోంది. ఈ ఆఫర్స్ అన్నీ కలిపి రూ.13,500 విలువైన ప్రయోజనాలు లభించనున్నాయి. కస్టమర్లు ఆధార్ బేస్డ్ లోన్ అప్లికేషన్ సువిధ స్కీమ్ ద్వారా కేవలం ఆధార్ కార్డును ప్రూఫ్‌గా ఇచ్చి వాహన రుణం తీసుకోవచ్చు.

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

దసరా, దీపావళి సందర్భంగా వాహనాలు కొనడం సెంటిమెంట్. ఈ సీజన్‌లో టూవీలర్లు, ఫోర్ వీలర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. సేల్స్‌ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ కూడా ఫెస్టివల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఓలా ఎస్1 ప్రో కొనేవారికి రూ.10,000 తగ్గింపు ప్రకటించింది. ఓల్ ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ.1,40,000.

RuPay Credit Card: రూపే క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఆ ఛార్జీలు లేవు

ఓలా ఎస్1 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే ఓలా ఎలక్ట్రిక్ నుంచి రిలీజైన హైఎండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ . ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో 3.97 kWh యూనిట్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. పోర్టబుల్ హోమ్ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేయొచ్చు. ఛార్జర్ కంపెనీ నుంచే లభిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6.30 గంటల సమయం పడుతుంది. గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Hero, SCOOTER, Two wheeler

ఉత్తమ కథలు