• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HERO MOTOCORP ANNOUNCED HALT TO ITS OPERATIONS AT ALL ITS MANUFACTURING UNITS FROM APRIL 22 TO MAY 1 DUE TO CORONA NS

Hero MotoCorp: హీరో సంస్థ సంచలన నిర్ణయం.. వాహనాల తయారీ నిలిపివేత.. వివరాలివే

Hero MotoCorp: హీరో సంస్థ సంచలన నిర్ణయం.. వాహనాల తయారీ నిలిపివేత.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ దేశీయ టూ వీలర్ల తయారీ కంపెనీ హీరో మోటాకార్ప్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన అన్ని తయారీ ప్లాంట్లలోనూ తయారీని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.

  • Share this:
    టూ వీలర్ల తయారీలో అతి పెద్దదిగా పేరొందిన ప్రముఖ దేశీయ కంపెనీ హీరో మోటాకార్ప్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన అన్ని తయారీ ప్లాంట్లలోనూ తయారీని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 22 నుంచి అంటే రేపటి నుంచి మే 1 వరకు కంపెనీకి సంబంధించిన దేశంలోని అన్ని ప్లాంట్లను మూసి వేస్తున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. అయితే ప్లాంట్లను మూసివేయడం కారణంగా వాహనాల తయారీ నిలిచిపోనుంది. దీంతో ఈ ప్రభావం డిమాండ్ పై పడే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి, అయితే కంపెనీ మాత్రం వాహనాల తయారీని నిలిపివేయడం ద్వారా డిమాండ్ పై ఎలాంటి ప్రభావం ఉండకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది.  ఈ మూసివేత ద్వారా ఏర్పడే ప్రొడక్షన్ లాస్ ను భర్తీ చేస్తామన్నారు.

    ప్లాంట్లు మూసి వేసి ఉన్న సమయంలో మెయింటెనెన్స్ పనులు పూర్తి చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే కంపెనీకి చెందిన అన్ని కార్పొరేట్ కార్యాలయాలు సైతం మూసి వేసే ఉన్నాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే మే 1 అనంతరం ప్రతీ ప్లాంటులోని వాహనాల తయారీ ఎప్పటిలాగే కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే దేశంలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతమవుతున్న ఈ సమయంలో కరోనా కారణంగా కార్యకలాపాలను మూసి వేసిన మొదటి అతి పెద్ద కంపెనీగా హీరో నిలిచింది.

    కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు తమ ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. హీరో సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద టూ వీలర్ తయారీ కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థకు 6 మానిఫాక్చరింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి మానిఫాక్చరింగ్ సామర్థ్యం 11.6 మిలియన్ యూనిట్లు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం సంస్థలో దాదాపు 8,599 మంది పర్మినెంట్ ఉద్యోగులతో పాటు దాదాపు 21,091 మంది తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.  దేశంలో లాక్ డౌన్ విధించకున్నా హీరో లాంటి అగ్ర వాహనాల తయారీ సంస్థ ఇలా తయారీ యూనిట్లను మూసి వేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ కంపెనీ బాటలో మరి కొన్ని సంస్థలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు