HeroMotoCorp: ఇప్పుడు కొత్తగా వినియోగదారుల ఇంటి వద్దకే బైకులు, స్కూటర్లను డెలివరీ చేయడం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే దీని కోసం నామమాత్రపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
HeroMotoCorp: దేశంలోనే అతిపెద్ద టూవీలర్ వాహనాల కంపెనీ హీరో మోటోకార్ప్ వినూత్న రీతిలో వ్యాపారం ప్రారంభించింది. ఇన్ని రోజులు టూవీలర్స్ కొనాలంటే షోరూంలకు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు కొత్తగా వినియోగదారుల ఇంటి వద్దకే బైకులు, స్కూటర్లను డెలివరీ చేయడం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే దీని కోసం నామమాత్రపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బైక్ కావాల్సిన వారు వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో హోమ్ డెలివరీ కోసం బుక్ చేసుకోవచ్చు. దీని కోసం రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ సౌకర్యం ముంబై, బెంగళూరు, నోయిడాల్లో ఈ సర్వీసు ఇప్పటికే అమల్లో ఉండటం గమనార్హం. అయితే రెండో విడతలో 25 నగరాల్లో డోర్ డెలివరీ సర్వీసులను ప్రారంభించాలని హీరో మోటో కార్ప్ భావిస్తోంది. ప్రస్తుతం యువత అభిరుచికి తగ్గట్టు తమ వ్యాపార మోడ్యుల్స్ మార్చుకుంటున్నట్లు హీరో మోటో కార్ప్ సేల్స్ హెడ్ సంజయ్ భాన్ తెలిపారు.