దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్తగా మాస్ట్రో ఎడ్జ్ 125 బైక్‌ను ఆధునిక ఫీచర్లతో ఆవిష్కరించింది. ఈ స్కూటర్ డ్రమ్, డిస్క్, కనెక్టెడ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. మాస్ట్రో ఎడ్జ్ 125 డ్రమ్ వేరియంట్ రూ. 72,250.. డిస్క్ వేరియంట్ రూ. 76,500, కనెక్టెడ్ వేరియంట్ రూ. 79,750 వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ న్యూ మాస్ట్రో ఎడ్జ్ 125లో అద్భుతమైన అప్డేటెడ్ ఫీచర్లను అందించారు. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్ బై టర్న్ నావిగేషన్, డిజిటల్ స్పీడో మీటర్, కాల్ అలర్ట్ వంటి ఫీచర్లను చేర్చింది. ఈ స్కూటర్ లైన్స్ అండ్ క్రీజెస్తో డ్యూయల్ టోన్ పెయింట్ స్కీంతో వస్తుంది. దీనిలో మునుపటి మోడల్ కంటే కొత్త టెక్నాలజీని అందించారు.
హీరో మోటోకార్ప్ మాస్ట్రో ఎడ్జ్.. డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని డిస్క్ వేరియంట్ కాండీ బ్లేజింగ్ రెడ్, పాంథర్ బ్లాక్. పెర్ల్ సిల్వర్ వైట్, మాట్ టెక్నో బ్లూ, ప్రిస్మాటిక్ ఎల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ అనే 6 కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. దీని డ్రమ్ వేరియంట్ కాండీ బ్లేజింగ్ రెడ్, పాంథర్ బ్లాక్, పెర్ల్ సిల్వర్, వైట్ మాట్ టెక్నో బ్లూ వంటి 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లేటెస్ట్ కనెక్టెడ్ వేరియంట్ ప్రిస్మాటిక్ ఎల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ అనే రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
హీరో మోటోకార్ప్ సేల్స్ అండ్ ఆఫ్టర్‌సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ ‘‘మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లకు భారత మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త మాస్ట్రో ఎడ్జ్ 125లో కొత్త వేరియంట్లను విడుదల చేశాం. ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లు, కొత్త డిజైన్‌తో రూపొందిన ఈ స్కూటర్ కచ్చితంగా యువతను ఎంతో ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం” అని అన్నారు. కొత్త మాస్ట్రో ఎడ్జ్ 125లో ఎక్స్సెన్స్ టెక్నాలజీతో కూడిన 124.6 సిసి బిఎస్ 6 కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటార్‌ను అందించారు. ఈ ఇంజిన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బీహెచ్‌పి టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇక, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.