Hero Pleasure Plus: హీరో నుంచి ప్లెజర్​ ప్లస్ ఎక్స్​టెక్​​ స్కూటర్​ లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

హీరో సంస్థ ఇప్పటికే అందిస్తున్న ఎంట్రీ లెవల్​ స్కూటర్​ ప్లెజర్​ ప్లస్​కు ఇది అప్​డేటెడ్​ మోడల్​గా విడుదలైంది. ఈ కొత్త మోడల్​ను ఎక్స్​ఎల్​​, ఎక్స్​టెక్​ అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

  • Share this:
ఆటోమొబైల్​ దిగ్గజం హీరో మోటోకార్ప్​ ఓ కొత్త స్కూటర్​ను మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్​టెక్ (Hero Pleasure+ XTec) పేరుతో ఇది లాంచ్​ అయ్యింది. హీరో సంస్థ ఇప్పటికే అందిస్తున్న ఎంట్రీ లెవల్​ స్కూటర్​ ప్లెజర్​ ప్లస్​కు ఇది అప్​డేటెడ్​ మోడల్​గా విడుదలైంది. ఈ కొత్త మోడల్​ను ఎక్స్​ఎల్​​, ఎక్స్​టెక్​ అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. దీని ఎక్స్ఎల్​ మోడల్​ రూ. 61,900, ప్లెజర్​ ప్లస్​ ఎక్స్​టెక్​ 110 మోడల్​ రూ. 69,500 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలోనూ అనేక అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇందులో డిజిటల్​ అనలాగ్​ స్పీడోమీటర్​, బ్లూటూత్​ కనెక్టివిటీ, సైడ్​ స్టాండ్​ ఇంజిన్​ కటాఫ్, ఎస్​ఎమ్​ఎస్​ అలర్ట్​​ వంటి అప్​డేటెడ్​ ఫీచర్లను చేర్చింది.

బ్లూటూత్​ కనెక్టివిటీ గల ఈ స్కూటర్​లో ఐడిల్​ స్టాప్​ స్టార్ట్​ సిస్టమ్​ను కూడా అందించింది. ఇది ఐ3 ఎస్​ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ స్కూటర్​ మొత్తం 7 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలోని జూబ్లియంట్​ ఎల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ స్కూటర్​లో కంపెనీ 110.9 సీసీ ఇంజిన్​ను చేర్చింది. ఇది ఎయిర్​కూల్డ్​ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ ఇంజిన్​ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త హీరో స్కూటర్ i3S టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది పెట్రోల్​ను ఆదా చేయడంలో సహాయపడుతుంది.

Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!


* బ్లూటూత్​ కనెక్టివిటీతో పాటు మరిన్ని ఫీచర్లు..
హీరో ప్లెజర్​ ప్లస్​ ఎక్స్​టెక్​ సీవీటీ ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​ సిస్టమ్​తో వస్తుంది. దీని ముందు వైపు, 130 ఎంఎం డ్రమ్​ బ్రేకులను అందించింది.​ ఈ స్కూటర్​లో ప్రొజెక్టర్​ హెడ్​లైట్లను ఉపయోగించింది. ఈ సెగ్మెంట్లలోని అన్ని స్కూటర్లలో కెల్లా మొట్టమొదటిసారి దీనిలోనే ఈ ఫీచర్​ను చేర్చింది. ఈ హెడ్​లైట్​ 25 శాతం ఎక్కువ బ్రైట్​నెస్​ ఇస్తాయి. దీనితో పాటు సైడ్​ వ్యూ మిర్రర్​ మీద క్రోమ్​ ట్రీట్​మెంట్​ను కూడా అందించింది. మఫ్లర్​ ప్రొజెక్టర్​, హ్యాండిల్​ బార్​, సీట్​ బ్యాక్​ రెస్ట్, డ్యూయల్​ టోన్​ సీట్​ వంటివి చేర్చింది. ఈ స్కూటర్​ 106 కేజీల బరువు కలిగి ఉంటుంది. ఇది 4.6 లీటర్ల ఇంధన సామర్థ్యం గల ట్యాంక్​తో వస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published: