Home /News /business /

HERO ELECTRIC WOOS PETROL BIKE OWNERS WITH ATTRACTIVE EXCHANGE OFFERS SS

Hero Electric Vehicle Offer: పాత టూవీలర్ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.6,000 అదనంగా డిస్కౌంట్

Hero Electric Vehicle Offer: పాత టూవీలర్ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.6,000 అదనంగా డిస్కౌంట్

Hero Electric Vehicle Offer: పాత టూవీలర్ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.6,000 అదనంగా డిస్కౌంట్

Hero Electric Vehicle Offer | ఇ-స్కూటర్స్ కొన్నవారికి వాహనంతో పాటు బ్యాటరీపై 3 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు తగ్గించిన తర్వాత ఇ-స్కూటర్ల ధరలు రూ.46,000 నుంచి రూ.87,000 మధ్య ఉన్నాయి.

    మీ దగ్గరున్న పాత టూవీలర్ ఎక్స్‌ఛేంజ్ చేద్దామనుకుంటున్నారా? ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెంచేందుకు హీరో మంచి ఆఫర్ ప్రకటించింది. మీ దగ్గరున్న పాత టూవీలర్ ఇచ్చి హీరో ఎలక్ట్రిక్ వెహికిల్ కొంటే మార్కెట్‌ వ్యాల్యూ కన్నా రూ.6,000 అదనంగా ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రకటించింది హీరో.

    ఇ-స్కూటర్స్ కొన్నవారికి వాహనంతో పాటు బ్యాటరీపై 3 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు తగ్గించిన తర్వాత ఇ-స్కూటర్ల ధరలు రూ.46,000 నుంచి రూ.87,000 మధ్య ఉన్నాయి. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, లక్నో, జైపూర్, చెన్నైతో పాటు దేశంలోని 20 పట్టణాల్లో ఈ ఆఫర్లు పొందొచ్చు. సో... మీరు మీ పెట్రోల్ బండిని వదిలించుకొని పర్యావరణానికి హాని చేయని వాహనం కొనాలనుకుంటే ఇది మంచి ఆఫరే.

    ఇవి కూడా చదవండి:

    I love you, Thank you... గూగుల్ ఎక్కువగా ట్రాన్స్‌లేట్ చేసినవి ఇవే

    Ombudsman Scheme: డిజిటల్ లావాదేవీలో మోసపోయారా? ఇలా కంప్లైంట్ చేయొచ్చు

    Shock: పేటీఎం మాల్‌లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?
    First published:

    Tags: Auto, Bike, Electric vehicle, Hero

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు