Home /News /business /

HERO ELECTRIC TOPS IN ELECTRIC BIKE SALES IN JULY BA GH

Hero Electric: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ అదుర్స్.. జూలైలో ఏకంగా ఎన్ని అమ్ముడయ్యాయంటే..

హీరో ఎలక్ట్రిక్ బైక్స్

హీరో ఎలక్ట్రిక్ బైక్స్

జులై నెల ఎలక్ట్రిక్ టూ-వీలర్ సేల్స్‌ రికార్డ్స్‌లో హీరో ఎలక్ట్రిక్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2022 జులైలో కంపెనీ మొత్తం 8,952 వాహనాలను విక్రయించింది. ఆ తర్వాత ప్లేస్‌లో ఉన్న ఒకినావా ఆటోటెక్, 8,094 వాహనాలను విక్రయించింది.

ఎలక్ట్రిక్ వాహనాల (Electris Vehicles Sales) అమ్మకాలు భవిష్యత్తులో పెరుగుతాయని చాలా కంపెనీలు ముందే అంచనా వేశాయి. ఈవీ సెక్టార్‌లో టాప్ ప్లేస్ కోసం ప్రణాళికలు వేసుకొని, ముందుకెళ్తున్నాయి. ఈ రంగంలో దూసుకుపోతున్న స్టార్టప్స్‌కు పెద్ద కంపెనీలు ఇప్పుడు పోటీగా నిలుస్తున్నాయి. తాజాగా వెల్లడైన జులై నెల ఎలక్ట్రిక్ టూ-వీలర్ సేల్స్‌ రికార్డ్స్‌లో హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2022 జులైలో కంపెనీ మొత్తం 8,952 వాహనాలను విక్రయించింది. ఆ తర్వాత ప్లేస్‌లో ఉన్న ఒకినావా ఆటోటెక్, 8,094 వాహనాలను విక్రయించింది. ఈ జూన్‌లో 3,829 వాహనాలను విక్రయించిన ఏథర్ ఎనర్జీ, జులైలో కేవలం 1,279 EV టూవీలర్స్ (Hero Electric Bikes) మాత్రమే విక్రయించింది. ఓలా ఎలక్ట్రిక్ జూన్‌లో 5,891 వాహనాలను అమ్మగా, జులైలో ఆ సంఖ్య 3,852కి తగ్గింది. జూన్‌లో 6,542 వాహనాలను విక్రయించిన ఆంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, గత నెలలో 6,312 వాహనాలను అమ్మింది.

ఈ వివరాలను VAHAN డేటాబేస్ తాజాగా వెల్లడించింది. వెహికల్స్ రంగు, పవర్, డీలర్, ఛాసిస్ నంబర్, ఇంధన రకంతో సహా 28 రకాల వాహన డేటాను VAHAN డేటాబేస్ కలెస్ట్ చేసి, విశ్లేషిస్తుంది. ఇటీవలి కాలంలో ఈవీ టూవీలర్స్ బ్యాటరీలు పేలిపోవడం, బైక్స్ మంటల్లో కాలిపోయిన ఘటనలు పెరగడంతో.. అన్ని కంపెనీల సేల్స్ పడిపోయినట్లు పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి భద్రతాపరమైన లోపాల గురించి వినియోగదారుల్లో నెలకొన్న భయం, మొత్తం సేల్స్‌ను ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు.

Maruti Suzuki Alto: 4 లక్షలకే మారుతీ సుజుకీ ఆల్టో వచ్చేస్తోంది... ప్రత్యేకతలివే



కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలో పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. బ్యాటరీ సమస్యల కారణంగా వాహనాలకు మంటలు అంటుకున్న అన్ని EV ద్విచక్ర వాహనాల కంపెనీలకు షోకాజ్ నోటీసులు అందజేశామని చెప్పారు. బ్యాటరీలు, బ్యాటరీ విడి భాగాలు, సంబంధిత వ్యవస్థలకు భద్రతా ప్రమాణాలను సూచించడానికి మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంబంధిత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీల CEOలు, MDలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వరుస ప్రమాదాల నేపథ్యంలో, మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్‌లను వారిపై ఎందుకు ప్రయోగించకూడదనే కారణాలను వివరించాలని నోటీస్‌లలో పేర్కొంది. 

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ విషయంపై స్పందించింది. బ్యాటరీ పేలుళ్లు, అగ్ని ప్రమాదాలపై వినియోగదారులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో.. నాలుగైదు EV టూవీలర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు ఈ వారం తెలిపింది. EV టూవీలర్స్ కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి CCPAకు అనేక ఫిర్యాదులు అందాయి. దీనిపై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి కూడా సమాచారం అందించింది. దాదాపు అన్ని EV ఫైర్ కేస్‌లలో.. బ్యాటరీ సెల్స్‌తో పాటు బ్యాటరీ డిజైన్‌లో లోపాలు ఉన్నట్లు DRDO పరిశోధనలో వెల్లడైంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Auto News, Electric Bikes, Hero Electric Scooter, Hero moto corp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు