బిజినెస్

  • Associate Partner
  • diwali-2020
  • diwali-2020
  • diwali-2020

Hero Electric Scooter: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు...

Hero Electric Scooter: సెప్టెంబర్ నుంచి టూవీలర్లు, ఫోర్ వీలర్ల సేల్స్ పెరుగుతోంది. కంపెనీలు కూడా... కరోనా వల్ల పడిపోయిన సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్లు ఇస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై దీపావళి ఆఫర్లేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 3, 2020, 7:18 AM IST
Hero Electric Scooter: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు...
Hero Electric Scooter: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు...
  • Share this:
Hero Electric Scooter: మీరు ఎలక్టిక్ స్కూటర్ లేదా టూ వీలర్ కొనుక్కోవాలనుకుంటే... ఈ దీపావళికి మంచి ఆఫర్లు ఇస్తోంది హీరో కంపెనీ. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆకర్షణీయమైన ఆఫర్ ఇస్తోంది. ఈ ఆఫర్... లిథియం ఐరన్, లెడ్ యాసిడ్ రేంజ్ స్కూటర్లకు వర్తిస్తోంది. యాసిడ్ మోడల్ స్కూటర్‌పై కస్టమర్లకు రూ.3000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే... లిథియం ఐరన్ స్కూటర్లపై రూ.5000 దాకా క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది కంపెనీ. హీరో కంపెనీ ఎలక్ట్రిక్ రిఫరల్ స్కీమ్ తెచ్చింది. దీన్లో భాగంగా... ఒకరితో వాహనం కొనిపిస్తే... వెయ్యి ప్రయోజనాలు అంటూ స్కీమ్ అమలుచేస్తోంది. ఐతే... ఈ స్కీమ్... కొత్తగా లాంచ్ చేసిన ఆప్టిమా HX సిటీ స్పీడ్, NYX HX సిటీ స్పీడ్ స్కూటర్లపై లేదు.

నవంబర్ 14న దీపావళి కాబట్టి... ఆ రోజు వరకూ హీరో కంపెనీ ఈ ఆఫర్లను అమలులో ఉంచుంతుంది. తాజాగా ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ కూడా తెచ్చింది. అలాగే... రూ.5000 దాకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. దీనికి అదనంగా... మరిన్ని డిస్కౌంట్లు ఉన్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దానికి తోడు డిజీల్, పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతూ... వాహనం నడపాలంటేనే జేబులు తడుముకోవాల్సి వస్తోంది. ఇదే సమయంలో... ట్రాఫిక్ జామ్స్ కూడా ఎక్కువగా అవుతూ... పెట్రోల్, డీజిల్ వృథా అయ్యేలా చేస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటు ధరల్లో లభించేలా కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ వాహనాలైతే... రూ.10 ఛార్జింగ్‌తో... దాదాపు 100 కిలోమీటర్ల దాకా వెళ్లొచ్చు. అందుకే హీరో కంపెనీ... దీపావళికి ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరిగేలా చేస్తోంది. నైక్ (Nike) లాంటి టూవీలర్ మార్కెట్‌లోకి వచ్చింది. మరిన్ని సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల్ని తెచ్చేందుకు హీరో ప్రయత్నిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: November 3, 2020, 7:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading