HERO ELECTRIC LAUNCHED OPTIMA HX ELECTRIC SCOOTER IN INDIA WITH CRUISE CONTROL KNOW PRICE AND SPECIFICATIONS SS GH
Hero Electric: హీరో ఎలక్ట్రిక్ నుంచి మరో స్కూటర్... ఆప్టిమా హెచ్ఎక్స్ ప్రత్యేకతలు ఇవే
Hero Electric: హీరో ఎలక్ట్రిక్ నుంచి మరో స్కూటర్... ఆప్టిమా హెచ్ఎక్స్ ప్రత్యేకతలు ఇవే
(image: Hero Electric)
Hero Electric Optima HX | ఇటీవల ఎలక్ట్రిక్ టూవీలర్లకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. హీరో ఎలక్ట్రిక్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఆప్టిమా హెచ్ఎక్స్ (Optima HX) ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి ఆప్టిమా హెచ్ఎక్స్ (Optima HX) సిటీ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ విడుదలైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో రూ. 55,580 (ఢిల్లీ, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. పోస్ట్ రివైజ్డ్ ఫేమ్ II సబ్సిడీతో కలుపుకొని సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. మొత్తం రెండు వేరియంట్లలో లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో క్రూయిజ్ కంట్రోల్‌ను (Cruise Contral) కూడా అందించడం అతిపెద్ద హైలైట్‌గా చెప్పవచ్చు. కొత్త హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎక్స్ స్కూటర్‌ను క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అప్డేట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కంపెనీ డిజైన్ చేసింది.
ఒకవేళ, మీరు క్రూయిజ్ కంట్రోల్‌ను యాక్టివేట్ చేయాలనుకుంటే.. ఒక్క బటన్ నొక్కితే సరిపోతుంది. క్రూయిజ్ కంట్రోల్ యాక్టివేట్ అయిన తర్వాత, అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనిపిస్తుంది. ఒకవేళ, క్రూయిజ్ కంట్రోల్‌ను నిలిపివేయాలనుకుంటే.. రైడర్ థొరెటల్‌ను ట్విస్ట్ చేయాలి లేదా బ్రేక్ వేయాల్సి ఉంటుంది.
క్రూయిజ్ కంట్రోల్ గల మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్..
ఈ సరికొత్త ఆప్టిమా హెచ్ సిటీ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూలర్ లాంచింగ్‌పై హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, ‘‘అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని పొందేందుకు హీరో ఎలక్ట్రిక్ నుంచి కొత్త స్కూటర్‌ను లాంచ్ చేస్తున్నాం. మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ సహాయంతో దీనిలో అద్భుతమైన ఫీచర్లను అందించాం. కొత్త ఆవిష్కరణలపై హీరో ఎలక్ట్రిక్ నిరంతరం కృషి చేస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్‌ను అందించడం ఇదే మొదటిసారి. దీనిలో బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్లను కూడా చేర్చాం. అయితే, ఈ ఫీచర్లను కస్టమర్ ఛాయిస్‌ను బట్టి ఎంచుకోవచ్చు. బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ గల వేరియంట్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.” అని చెప్పారు.
కాగా, హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎక్స్ 1.2 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 42 kmph వేగంతో ప్రయాణించగలదు. ఫుల్ ఛార్జ్‌పై 82 km డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని సింగిల్- బ్యాటరీ వెర్షన్ రూ. 55,580 ధర వద్ద, డ్యూయల్-బ్యాటరీ వెర్షన్ రూ. 65,640 ధర వద్ద అందుబాటులో ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.