Hero Electric: భారీగా తగ్గిన హీరో ఎలక్ట్రిక్​​ స్కూటర్ల ధరలు... ఏ బండిపై ఎంత తగ్గిందంటే

Hero Electric: భారీగా తగ్గిన హీరో ఎలక్ట్రిక్​​ స్కూటర్ల ధరలు... ఏ బండిపై ఎంత తగ్గిందంటే (ప్రతీకాత్మక చిత్రం)

Hero Electric | ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. హీరో ఎలక్ట్రిక్ వాహనాలపై 33 శాతం ధరలు తగ్గాయి. ఏ వాహనంపై ఎంత ధర తగ్గిందో తెలుసుకోండి.

  • Share this:
ఎలక్ట్రిక్​ టూవీలర్లు కొనాలనుకుంటున్న వారికి హీరో ఎలక్ట్రిక్​ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తమ మోడళ్ల ధరను 33 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎలక్ట్రిక్​​ వాహనాలను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటించించడంతో హీరో ఎలక్ట్రిక్​​ సైతం ధరలను తగ్గించింది. ప్రభుత్వం ఇస్తున్న లబ్ధిని వినియోగదారులకు చేరవేస్తున్నామని వెల్లడించింది. సింగిల్ బ్యాటరీ వేరియంట్స్​పై 12 శాతం ధరను తగ్గించిన ఈ సంస్థ.. ట్రిపుల్​ బ్యాటరీ ఎన్​వై హెచ్​ఎక్స్ మోడల్​పై 33 శాతం తగ్గించింది. కొత్త ధరల ప్రకారం ఫోటోన్ హెచ్ ఎక్స్ మోడల్​ రూ.79,940 నుంచి రూ.71,449కు దిగి వచ్చింది. అలాగే ఎన్​వైఎక్స్ హెచ్​ఎక్స్​ మోడల్​ ధర రూ.1,31,115 నుంచి రూ.85,136కు తగ్గింది. అలాగే ఎర్టిమా ఈఆర్​ ధర తొలుత రూ.78,640 ఉండగా.. ఇప్పుడు రూ.58,980కే అందుబాటులోకి తెచ్చినట్టు హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది.

Bank Holidays in July 2021: జూలైలో బ్యాంకులకు 7 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌తో కోటీశ్వరులు కావొచ్చు... లెక్క ఇదే

బ్యాటరీలు, ఈవీలతో పాటు ఫేమ్ పాలసీ కింద వచ్చిన అన్ని సబ్సిడీల వల్ల ఎలక్ట్రిక్​​ వాహనాల తయారీ, వినియోగం బాగా పెరుగుతుందని హీరో ఎలక్ట్రిక్​ సీఈవో సోహిదెర్ గిల్ అన్నారు. గతేడాది కరోనా ప్రభావం ఉన్న తమ మోడళ్ల అమ్మకాలు చాలా బాగా జరిగాయని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతుందనేందుకు ఇది నిదర్శనమని చెప్పారు. హై స్పీడ్​ ఎలక్ట్రిక్​​ స్కూటర్స్​ ‘సిటీ స్పీడ్ సిరీస్​’ను చేపట్టడం తమకు బాగా కలిసి వచ్చిందని గిల్ చెప్పారు. అలాగే గత రెండేళ్ల నుంచి వస్తున్న సబ్సిడీలు కూడా ఊతమిచ్చాయన్నారు. అన్నీ కలిసి తమ మోడళ్లు అనుకున్న దాని కంటే ఎక్కువగా అమ్ముడవుతున్నాయని వెల్లడించారు.

Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ఫస్ట్ ఫ్లాష్ సేల్... డిస్కౌంట్ వివరాలు ఇవే

Samsung Galaxy M32: కాసేపట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎం32 సేల్

"ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న పాలసీలు ఎలక్ట్రిక్​​ వాహనాల తయారీ పరిశ్రమలకు ఎంతో ఊతమిచ్చేలా ఉన్నాయి. రానున్న ఐదేళ్లలో దాదాపు 50 లక్షల నుంచి 70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రో​డ్లపైకి వస్తాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా రెండు సంవత్సరాల నుంచి లభిస్తున్న సబ్సిడీల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కూడా పెరిగింది" అని సుహిందర్ గిల్ చెప్పారు.

ఇటీవల ఫేమ్-2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సబ్సిడీలు ప్రకటించింది. టూ వీలర్లకు కిలో వాట్ అవర్​కు ఇంతకు ముందు పరిశ్రమలకు రూ.10వేల సబ్సిడీ లభిస్తుండగా.. ప్రస్తుతం అది రూ.15వేలకు పెరిగింది. అలాగే ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీపై ఇంతకు ముందు వరకు ప్రభుత్వం 20 శాతం ఇన్సెంటివ్​లు ఇస్తుండగా అది 40 శాతానికి వెళ్లింది. దీంతో తయారీ సంస్థలు ఎలక్ట్రిక్​​ వాహనాల ధరను కూడా తగ్గిస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published: