ప్రముఖ ఇండియన్ టూవీలర్(Indian Two Wheeler) తయారీదారు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఎప్పటికప్పుడు సరికొత్త వెహికల్స్(Vehicles) పరిచయం చేస్తోంది. ముఖ్యంగా తక్కువ ధరలకే అదిరిపోయే టెక్ ఫీచర్లతో(Tech Features) స్కూటర్లను లాంచ్ చేస్తూ వాహనదారులను ఇది బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ కంపెనీ డెస్టినీ 125 ఎక్స్‌టెక్ (Destini 125 XTEC) అనే కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త హీరో డెస్టినీ 125 ఎక్స్‌టెక్ స్కూటర్ న్యూ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎన్‌హాన్స్‌డ్ రెట్రో డిజైన్, క్రోమ్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. ఇది నెక్సస్ బ్లూ (Nexus Blue) కలర్‌లో లాంచ్ అయింది. ఇందులో i3S టెక్నాలజీ, (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్), ఫ్రంట్ యూఎస్‌బీ ఛార్జర్, కాల్ & SMS అలర్ట్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజి అనలాగ్ స్పీడోమీటర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, సీట్ బ్యాక్‌రెస్ట్ వంటి ఫీచర్‌లను అందించారు. దీని ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డెస్టినీ 125 XTEC స్కూటర్ రెండు వేరియంట్‌లలో విడుదలైంది. అయితే డెస్టినీ 125 XTEC టాప్ ఎండ్ వేరియంట్ (Top End Variant) ప్రారంభ ధరను రూ.79,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. స్టాండర్డ్ వేరియంట్ (STD Variant) ప్రారంభ ధర రూ.69,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త డెస్టినీ 125 XTEC లో అద్దాలు, మఫ్లర్ ప్రొటెక్టర్, హ్యాండిల్‌బార్‌పై ప్రీమియం క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ‘XTEC’ బ్యాడ్జింగ్, డ్యూయల్ టోన్ సీటు, కలర్డ్ ఇన్నర్ ప్యానెల్‌లు ఈ స్కూటర్‌కు ప్రత్యేకమైన లుక్ అందిస్తాయి. దీనికి ముందు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. రైడర్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఈ స్కూటర్‌లో ఇచ్చిన సైడ్-స్టాండ్ విజువల్ ఇండికేషన్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్లు హైలెట్ గా నిలుస్తాయి.\
టెక్నికల్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. డెస్టినీ 125 XTEC 125cc BS-VI కంప్లైంట్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 7000 RPM వద్ద 9 bhp పవర్‌ను, 5500 RPM వద్ద 10.4NM టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని లాంచింగ్ సందర్భంగా హీరో మోటోకార్ప్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడారు. XTEC టెక్నాలజీ ప్యాకేజ్ సరికొత్త టెక్నాలజీగా ఓన్ నేమ్ క్రియేట్ చేస్తుందని చెప్పారు. ‘మేం గ్లామర్ 125, ప్లెజర్+ 110పై XTEC ఎడిషన్‌లను విడుదల చేసి సక్సెస్ అయ్యాం. ఈరోజు దీనిని డెస్టినీ 125లో ప్రవేశపెట్టాం. ఇది దాని పాపులారిటీని మరింత పెంచుతుంది.
డెస్టినీ XTEC దాని కొత్త LED హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా క్రోమ్ స్ట్రిప్, ఎలిగంట్ స్పీడోమీటర్ ఆర్ట్‌వర్క్, నైస్ బ్యాక్‌రెస్ట్ ద్వారా క్లాసిక్ స్టైల్ ను అందిస్తుంది. మీరు స్మార్ట్‌గా ఉండే టైమ్‌లెస్ కమ్యూటర్ కోసం చూస్తున్నట్లయితే.. డెస్టినీ 125 XTEC ఎడిషన్ మీ కోసం ఎదురుచూస్తుంటుంది!’ అని మాసన్ వివరించారు. హీరో కంపెనీ తమ స్కూటర్లలో కంటిన్యూగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. చక్కటి ఫీచర్లు గల స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి డెస్టినీ 125 ఎక్స్‌టెక్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని హీరో మోటో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Hero, Hero moto corp