హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Filing: మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకున్నా...ఐటిఆర్ ఎందుకు దాఖలు చేయాలి...

ITR Filing: మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకున్నా...ఐటిఆర్ ఎందుకు దాఖలు చేయాలి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టాక్స్ మాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ వాధ్వా ప్రకారం నిర్దేశించిన దాని కంటే ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ ఎటువంటి సందర్భాల్లో ITR ఫైల్ చేయాలో తెలుసుకుందాం :

  ఆదాయపు పన్ను (ఐ-టి) చట్టం ప్రకారం ఎక్కువ ఆదాయం పొందే వారు అనగా నిర్ధేశించిన పరిమితి కంటే ఎక్కువ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్ను(ఐటిఆర్)ను దాఖలు చేయాలి. కొన్ని సందర్భాల్లో మొత్తం ఆదాయం నిర్ధేశించిన దానికంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. టాక్స్ మాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ వాధ్వా ప్రకారం నిర్దేశించిన దాని కంటే ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ ఎటువంటి సందర్భాల్లో ITR ఫైల్ చేయాలో తెలుసుకుందాం :

  1. మూలధన లాభం మినహాయింపు(సెక్షన్ 54 నుండి 54 జిబి) లేదా తగ్గింపు(సెక్షన్ 80సి నుండి 80యు) ముందు వ్యక్తి యొక్క ఆదాయం పన్ను వసూలు చేయని గరిష్ట మొత్తాన్ని మించినప్పుడు;

  2. భాతరదేశానికి చెందిన వ్యక్తి విదేశీ ఆస్తులను కలిగి ఉంటే.

  కింది సందర్భాల్లో పన్ను మినహాయింపు పొందండి

  చాప్టర్ 6ఎ లోని C భాగంలో ఉన్న ‘నిర్దిష్ట ఆదాయానికి తగ్గింపులు" శీర్షిక (సెక్షన్ 80QQB, 80RRB, మొదలైనవి) ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.

  1. నష్టాలను ఎక్కువగా ఉన్న సందర్భంలో

  2. TDS / TCS వాపసును క్లెయిమ్ చేయండం ద్వారా

  3. రాజకీయ పార్టీకి సెక్షన్ 13ఎ కింద పన్ను మినహాయింపు ఉంటుంది

  4. సెక్షన్ 11 మరియు 12 కింద స్వచ్ఛంద లేదా మత ట్రస్ట్కు పన్ను మినహాయింపు ఉంటుంది.

  హోస్ట్ బుక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ కపిల్ రానా ప్రకారం, సెక్షన్ 139 (1)లోని ఏడవ నిబంధన పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తి అతని యొక్క ఆదాయం నిర్దేశించిన పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

  ఐటిఆర్ దాఖలు చేయాల్సిన వారు

  1. ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ అకౌంట్లలో జమ చేసిన వ్యక్తి నుంచి పన్ను తిరిగి రాబట్టడం అవసరం.

  2. ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి సొంతగా లేదా మరే వ్యక్తి కోసమైనా విదేశీ ప్రయాణానికి 2 లక్షల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తే రిటర్ను దాఖలు చేయడం అవసరం.

  3. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగం కోసం ఒక లక్ష లేదా లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రిటర్ను దాఖలు చేయడం అవసరం.

  4. పన్ను చెల్లించని ఆదాయం ఉన్నవారు వీసా, బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ వంటి ఇతర ప్రయోజనాల కోసం ఐటిఆర్ దాఖలు చేయవచ్చని ఇండియాఫిలింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లియోనెల్ చార్లెస్ సూచించారు. ఆదాయపు పన్ను దాఖలు ప్రారంభించిన తర్వాత, ఆదాయం పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ కొనసాగడం మంచిదని రానా అభిప్రాయపడ్డారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Income tax, Personal Finance

  ఉత్తమ కథలు