హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: కేంద్ర బడ్జెట్ నుంచి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆశించేది ఏంటి..? మార్కెట్‌కు ఏం కావాలి?

Budget 2023: కేంద్ర బడ్జెట్ నుంచి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆశించేది ఏంటి..? మార్కెట్‌కు ఏం కావాలి?

Budget 2023: కేంద్ర బడ్జెట్ నుంచి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆశించేది ఏంటి..? మార్కెట్‌కు ఏం కావాలి?

Budget 2023: కేంద్ర బడ్జెట్ నుంచి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆశించేది ఏంటి..? మార్కెట్‌కు ఏం కావాలి?

Budget 2023: 2023 బడ్జెట్‌ ద్వారా అడ్డంకులను తొలగించి మార్కెట్‌కు ఊపునిచ్చే నిర్ణయాలు రావాలని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు. అంతేకాకుండా, 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' వంటి భారతదేశ ప్రధాన కార్యక్రమాల పట్ల కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని పునరుద్ధరించాలని కూడా కోరుతున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Dప్రస్తుతం భారతీయ ఆటో రంగం ప్రపంచంలోనే అతి పెద్ద ఆటో మార్కెట్లలో నాలుగోది. 222 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువతో కళకళలాడుతోంది. 2022లో ఈ రంగ అభివృద్ధి చెప్పుకోదగినదిగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (Financial Year)నూ ఇదే ఊపు కొనసాగుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ (India)ను మూడో అతి పెద్ద ఆటో మార్కెట్‌గా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగిన ప్రోత్సాహక నిర్ణయాలను ఈ బడ్జెట్‌ ద్వారా తీసుకుంటుందని మార్కెట్‌ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పుడు భారతీయ ఆటో రంగంలో ఈవీ (EV)ల ట్రెండ్‌ నడుస్తోంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వాడకం వైపు ఇప్పుడు అంతా మొగ్గు చూపడం మొదలుపెట్టారు. దీంతో తయారీ రంగంలోనూ వీటి మోడళ్ల తయారీకి ఇప్పుడు గిరాకీ ఉంది. బడ్జెట్‌లో తదనుగుణంగా నిర్ణయాలు రావాలని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దగ్గర నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడం వరకు ప్రభుత్వం ఏం చెబుతుందనేదానిపై ఇప్పుడు వారిలో ఆసక్తి నెలకొంది.

* బడ్జెట్‌లో నిర్ణయాలు ఉంటాయా?

ఈ బడ్జెట్‌ ద్వారా అడ్డంకులను తొలగించి మార్కెట్‌కు ఊపునిచ్చే నిర్ణయాలు రావాలని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు. అంతేకాకుండా, 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' వంటి భారతదేశ ప్రధాన కార్యక్రమాల పట్ల కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని పునరుద్ధరించాలని కూడా కోరుతున్నారు.

* జీరో ఎమిషన్స్‌ కోసం ప్రోత్సాహక స్కీమ్స్‌

భారతదేశం నెట్‌ జీరో కార్బన్‌ ఎమిషన్స్‌ని సాధించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. అందుకు ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజన్లు, హైడ్రోజన్‌ ప్యూయల్‌ సెల్స్‌, హైబ్రీడ్‌ కార్లు లాంటి వాటిని అడాప్ట్‌ చేసుకోవాల్సి ఉంది. అయితే దీనికి ప్రొడక్ట్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్‌ స్కీమ్‌ వంటి వాటిని కేంద్రం ప్రొవైడ్‌ చేయాలని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రోత్సాహకాలు అందించడం, వాటి అమలుకు సహకరించడం ద్వారా తాము ఆ దిశగా అడుగులు వేయగలుగుతామని అంటున్నాయి.

ఇది కూడా చదవండి :  బడ్జెట్‌లో వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్‌కు ప్రాధాన్యం.. రైల్వే కేటాయింపులపై కేంద్రం కసరత్తు

* ఈవీలపై పన్ను తగ్గింపు

ఎలక్ట్రిక్ వాహనాలపై చెల్లించాల్సిన ఉత్పత్తి పన్ను 5 శాతంగా ఉంది. అయితే దీనిలో వాడే బ్యాటరీలపై మాత్రం 18 శాతం జీఎస్టీ (GST) ఉంది. అలాగే వీటిలో వాడే ఇంకొన్ని విడి భాగాలు కూడా జీఎస్టీ 28శాతం స్లాబ్‌ రేటులో ఉన్నాయి. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. పర్యావరణహితమైన ఈ ఈవీ(EV)ల వాడకాన్ని ప్రోత్సహించాలంటే తప్పకుండా ఈ విడి భాగాలు, బ్యాటరీలపై జీఎస్టీని తగ్గించాలని మార్కెట్‌ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వెయిట్‌ బేస్‌ మీద కాకుండా వేల్యూ బేస్‌ మీద వీటిపై సుంకాలను మార్చాలని కోరుతున్నాయి.

* ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌

ఈవీల మార్కెట్‌ భవిష్యత్తులో పెరుగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తదనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాలు ఛార్జింగ్‌ స్టేషన్లను ఇన్‌స్టాల్‌ చేయడానికి ప్రోత్సాహకాలను అందించాయి. అలాగే కేంద్రం కూడా ఈ విషయంలో ప్రోత్సాహకాలను అందించాలని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్ ఆశిస్తున్నారు.

First published:

Tags: Auto, Budget 2023, Budget 2023-24, Electric Vehicle, GST

ఉత్తమ కథలు