HERES HOW WHATSAPP COMMUNITY FEATURE MAY WORK ON ANDROID SMARTPHONES GH VB
WhatsApp: ఇటీవల అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్.. ఎలా పని చేస్తుంది.. వివరాలను తెలుసుకోండి..
(ప్రతీకాత్మక చిత్రం)
వాట్సాప్ గతంలో ప్రకటించిన ‘కమ్యూనిటీస్’ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు రోలవుట్ చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
మెటా(Meta) (గతంలో Facebook) యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్(Messaging App) వాట్సాప్(Whatsapp) రోజు రోజుకు కొత్త ఫీచర్లను(Features) జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే గతంలో ప్రకటించిన ‘కమ్యూనిటీస్(Communities)’ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు రోలవుట్ చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది. WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా కొత్త అప్డేట్ను విడుదల చేసింది. దీన్ని 2.22.2.10 వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. తాజా బీటా అప్డేట్ భవిష్యత్తులో కమ్యూనిటీలను క్రియేట్ చేయడానికి యూజర్లను అనుమతించే అద్భుతమైన అప్డేట్గా నివేదిక పేర్కొంది. కొన్ని వారాల క్రితం iOS స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం విడుదల చేసిన బీటా అప్డేట్లో కూడా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ కొత్త ఫీచర్ ప్రకారం, ఒక కమ్యూనిటీలో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ ఉంటుందని వాట్సాప్ తెలిపింది. అంతేకాకుండా, కమ్యూనిటీలకు అడ్మిన్‌గా ఉన్న వాళ్లు కమ్యూనిటీలో ఉన్న అన్ని గ్రూపుల్లోకి మెసేజ్ పంపే వెసులుబాటు కూడా ఉంటుంది.
కమ్యూనిటీ గ్రూప్‌లు ఎలా క్రియేట్ చేయాలి?
WABetainfo విడుదల చేసిన స్క్రీన్షాట్ల ప్రకారం, వాట్సాప్ గ్రూప్‌ల వలే కమ్యూనిటీ అడ్మిన్లు ఇతరులను ఇన్వైట్ లింక్, క్యూఆర్ కోడ్ లేదా మాన్యువల్‌గా కమ్యూనిటీలోకి తీసుకోవచ్చు. ఇలా చేరిన వ్యక్తి ఇతర సభ్యులతో చాట్ చేయొచ్చా? లేదా అనే అంశం కమ్యూనిటీ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ కమ్యూనిటీ గ్రూప్ ఐకాన్లు చతురస్రాకారంగా ఉండి నాలుగు వైపులా రౌండ్ ఎడ్జులు కలిగి ఉంటాయి. కమ్యూనిటీ గ్రూప్‌లకు వేర్వేరు చాట్ ఐకాన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కమ్యూనిటీ ఫీచర్ ద్వారా సమాచారాన్ని ఎక్కువ మందితో పంచుకోవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు ముందుగా కమ్యూనిటీ పేరు, డిస్క్రిప్షన్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేసి 10 గ్రూప్‌లకు ఒకేసారి లింక్ సెండ్ చేయవచ్చు. ఇక, కమ్యూనిటీలో ఒక సీక్రెట్ గ్రూప్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే, యూజర్లు కమ్యూనిటీలో చేరినప్పుడు, వారు అన్‌లింక్ చేసిన గ్రూప్‌లను యాక్సెస్ చేయలేరని WABetainfo మునుపటి నివేదిక సూచిస్తుంది. ఇక, యూజర్లు గ్రూప్ నుంచి నిష్క్రమించినప్పుడు గ్రూప్ మెంబర్స్‌తో చాట్ చేయలేరు. ప్రస్తుతం, ఈ ఫీచర్ డెవలప్ స్టేజ్‌లో ఉన్నందున కమ్యూనిటీలను సృష్టించలేరు. భవిష్యత్ అప్డేట్లలో ప్లాట్‌ఫారమ్ ఫీచర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.